లారెన్స్ దెయ్యం సినిమాల సీక్వెల్స్

Submitted on 16 April 2019
Sequels of ghost movies directed by raghava lawrence

హరర్ కే హడలెత్తిస్తున్నాడు త్రిల్లర్ సినిమాల దర్శకుడు రాఘవ లారెన్స్. వరుసగా దెయ్యం సినిమాల సీక్వెల్ లతో ప్రేక్షకులను భయపెట్టిస్తున్నాడు. స్టార్ డాన్స్ మాస్టార్ పేరు కాస్తా దెయ్యాల డైరక్టర్ గా ఫిక్స్ అయ్యేలా కనిపిస్తుంది. ఇప్పటికే మూడు డెవిల్ సబ్జెట్ మూవీస్ తో ఆకట్టకున్న తమిళ తంబి, ఫోర్త్ సీక్వెన్స్ మూవీతో రెడీగా ఉన్నాడు.

హరర్ సీక్వెన్స్ మూవీస్ తో సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశాడు డాన్స్ మాస్టార్ రాఘవ లారెన్సన్. కామెడీ హరర్ మూవీస్ లో సౌత్ ఇండియాలోనే సరికొత్త రికార్డ్ లతో పాటు మంచి సక్సెస్ రేట్ ను కూడా సాధించాడు. ఓన్ డైరక్షన్ లో తానే హీరోగా ఇప్పటి వరకు మూడు దెయ్యం సినిమాలు తీసిన రాఘవ, నాలుగో మూవీతో రెడీగా ఉన్నాడు. ఇప్పటి వరకు ముని, కాంచన, కాంచన-2 సినిమాలను అందించిన రాఘవ లారెన్స్ ఇప్పుడు కాంచన-3 మూవీ రూపొందించాడు.. ఏప్రిల్ 19 న ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నారు.
Read Also : మరో నలుగురు ప్లేయర్లను ప్రకటించిన బీసీసీఐ

హరర్ మూవీస్ కు సీక్వెల్ మూవీస్ రాలేదు.. వచ్చినా కాంచన సినిమాలు వచ్చినట్టు నాలుగు సీక్వెల్ మూవీస్ ఇంత వరకు రాలేదు. ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడం, ఒక మూవీ నుండి మరో మూవీ సీక్వెల్స్ కావాలని ఫ్యాన్స్ అడుగుతుండటంతో వదలకుండా వరుసగా దెయ్యం సినిమాలు రూపొందిస్తున్నాడు రాఘవ లారెన్స్. డాన్స్ మాస్టర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసిన తమిళ తంబి, డైరక్టర్ గా మారి..ఇలా వరుస హారర్ మూవీస్ తీస్తుండటంతో దెయ్యాల సినిమా డైరక్టర్ గా ఆయన ఫిక్స్ అయ్యేట్లు కనిపిస్తుంది. అంతే కాదు కాంచన మూవీ నుండి పది సీక్వెల్స్ సినిమాలు వరకు ట్రై చేస్తానంటున్నాడు రాఘవ.

రాఘవ లారెన్స్ డైరక్షన్ చేస్తూ నటించిన కాంచన మూవీ మూడు సిరిస్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. హరర్ కాన్సెప్ట్ లోకూడా డిఫరెంట్ స్టోరీలను సెట్ చేసుకుంటూ.. వాటికి కామెడీ కంటెంట్ ను యాడ్ చేసుకుంటున్నాడు రాఘవ. ఇప్పుడు రాబోతున్న కాంచన3 లో ఇంకా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడీ హీరో. వైట్ హెయిర్ లో ఓల్డ్ లుక్ తో భయపెట్టబోతున్నాడు. ఇప్పటి వరకు వచ్చిన మూడు సినిమాల మాదిరిగానే ఈ మూవీ కూడా సక్సెస్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు రాఘవ లారెన్స్. 
Read Also : RRR మూవీపై రూమర్స్ : ప్రభాస్ గెస్ట్ రోల్

ghost movies
Sequels
direct
Raghava Lawrence
Hyderabad


మరిన్ని వార్తలు