చైతూతో శేఖర్ కమ్ముల

Submitted on 20 June 2019
Sekhar Kammula is Going to Direct Yuva Samrat Akkineni Naga Chaitanya

యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుంది. ఫిదా సూపర్ హిట్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న శేఖర్ కమ్ముల తన శైలిలో ఉంటూనే చైతు బాడీ లాంగ్వేజ్‌కి తగ్గ ప్రేమకథ రెడీ చేసాడని తెలుస్తుంది. చైతన్యకిది 20వ సినిమా కావడం విశేషం. ఏషియన్ సినిమాస్ అధినేత నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి.చైర్మన్ రామ్మోహనరావు కలిసి నిర్మిస్తున్నారు. కేవలం 70 రోజుల్లోనే షూటింగ్ పుర్తి చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. 

ఈ సినిమాలో చైతు సరసన సాయి పల్లవి నటించనుంది. ఫిదా తర్వాత ఆమె శేఖర్ కమ్ములతో కలిసి పనిచేస్తుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులతో పాటు, నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుంది.

సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. చైతు, విక్టరీ వెంకటేష్‌తో కలిసి వెంకీమామలో నటిస్తుండగా, సాయి పల్లవి రానాతో నటించబోయే విరాటపర్వం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

Akkineni Naga Chaitanya
NC20
(1506)
Sai pallavi
Sekhar Kammula

మరిన్ని వార్తలు