ఫుడ్‌లో వెంట్రుక: ప్యారడైజ్ హోటల్‌కు లక్ష జరిమానా

Submitted on 17 October 2019
secunderabad paradise hotel to be fined as rs.1 lakh

జీహెచ్ఎంసీ అధికారుల ధాటికి సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ హోటల్‌ జరిమానా కట్టాల్సి వచ్చింది. ఫుడ్ ప్రిపేర్ లో నిర్లక్ష్యం వహించడంతో తిప్పలు తప్పలేదు. బిర్యానీలో తల వెంట్రుకలు వచ్చాయంటూ కస్టమర్.. హోటల్ యాజమానికి ఫిర్యాదు చేశారు. తప్పు ఉన్నప్పటీకి తగ్గి మాట్లాడకుండా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు హోటల్ ప్యారడైజ్ పీఆర్వో రాఘవ.

కస్టమర్.. అతని దురుసు వైఖరి పట్ల జీహెచ్‌ఎంసీ ఫిర్యాదు చేశాడు. జీహెచ్ఎంసీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు నిర్వహించారు. తీగ లాగితే డొంక కదిలినట్లు ఒక్క వెంట్రుకతో పోయే దానిని హోటల్ పరిసరాలపై కన్ను పడేలా చేసుకున్నాడు. పరిశుభ్రత పాటించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన జీహెచ్ఎంసీ అధికారులు రూ.లక్ష జరిమానా విధిస్తూ నోటీసులు ఇచ్చారు. 

దాంతో పాటు వారం రోజుల్లోగా పరిశుభ్రత పాటిస్తున్నట్లు తెలియజేసి, లోపాలు సరిచేసుకోవాలని సూచించారు. అలా చేయని పక్షంలో హోటల్‌ను సీజ్ చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. 

Secunderabad
paradise hotel
rs.1 lakh
paradise

మరిన్ని వార్తలు