మనుషులేనా : దిశ రేప్ వీడియో కోసం తెగ వెదికారట

Submitted on 3 December 2019
search for disha rape video in google, youtube

మనుషుల్లో ఇంకా చాలామంది మృగాలు, కిరాతకులు మన మధ్యే ఉన్నారనే విషయం బయటపడింది. మనుషులు అనడం కంటే శాడిస్టులు, నీచులు అంటే కరెక్ట్ గా సరిపోతుందేమో. కనీసం మానవత్వం, విలువలు కూడా లేకుండా పోయాయి. హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ దిశ.. నలుగురు మృగాళ్ల వేటకి బలైపోయింది. హత్యాచార నిందితులు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అయితే బయట అలాంటి మృగాళ్లు ఇంకా చాలామందే ఉన్నారనే విషయం వెలుగు చూసింది. దిశ ఘటన మర్చిపోక ముందే.. అంతకంటే దారుణమైన, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన జరిగింది.

ఓ ఆడపిల్ల నరకం అనుభవించి ప్రాణాలు కోల్పోతే.. ఆ కీచక కాండను కళ్లారా చూసి ఆనందించాలని నీచులు ఆశించారు. దేశంలో చాలామంది దిశ అత్యాచారం ఘటనకు సంబంధించిన వీడియో కోసం గూగుల్, యూట్యూబ్ లో తెగ వెతికారట. డిసెంబర్ 1, 2 తేదీల్లో ''డాక్టర్ రేప్ అండ్ మర్డర్'', ''హైదరాబాద్ గ్యాంగ్ రేప్ వీడియో'' సహా పలు పదాలతో ఎక్కువమంది సెర్చ్ చేసినట్లు ఓ సంస్థ సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా ఏకంగా 80లక్షల మంది ఇలా సెర్చ్ చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో అంతా షాక్ అవుతున్నారు. ఛీ..ఛీ మనుషులేనా అని చీదరించుకుంటున్నారు. అయినా ఆడపిల్లలను తోలు బొమ్మలుగా చూస్తున్న వారికి ఇలాంటి ఆలోచనలు తప్ప ఇంకేం వస్తాయని అని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

ప్రస్తుతం జైల్లో ఉన్న హత్యాచార నిందితులను మించిన చాలామంది క్రూరులు మనుషుల రూపంలో సభ్య సమాజంలో స్వేచ్చగా తిరుగుతున్నారనే నిజం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 80లక్షల మంది దిశ రేప్ వీడియో చూడాలని వెతకడం ఘోరాతి ఘోరం అంటున్నారు. దిశ రేప్ వీడియో పదం టాప్ ట్రెండింగ్ లో ఉండటం.. దారుణానికి అద్దం పడుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. మానవత్వం ఏ స్థాయికి పడిపోయిందో. మనిషి ఎంత పైశాచికంగా తయారవుతున్నాడో.

ఒక అమ్మాయి నరకం అనుభవించి చనిపోతే దానికి సబంధించిన వీడియో కోసం అన్ని సెర్చ్ లు నమోదు అవ్వడాన్ని ఏమనాలి. ఇలాంటి వాళ్ల కంటే జంతువులే బెటర్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మనం ఇలాంటి సమాజంలో ఉన్నామా అని అంతా సిగ్గుపడుతున్నారు. క్రూరత్వాన్ని మనసంతా నింపుకున్న ఇలాంటి రాక్షసుల కారణంగానే మహిళలపై ఘోరాలు జరుగుతున్నాయని వాపోయారు.

disha
rape video
Hyderabad
Shamshabad
Veterinary doctor
search
TREND

మరిన్ని వార్తలు