పెట్రల్, డీజిల్ అక్కర్లేదా : ప్లాస్టిక్ వ్యర్థాలతో 100% క్లీన్ ఇంధనం

Submitted on 16 February 2019
Scientists reveals to Plastic Waste in to 100 percent Clean Fuel 

రోజుకు టన్నుల కొద్ది ప్యాస్టిక్ వ్యర్థాలు పుట్టుకొస్తున్నాయి. రోడ్లపై ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే. డ్రైనేజీల్లో, సముద్రజాలలను సైతం ఈ ప్లాస్టిక్ భూతం పీడిస్తోంది. వందల సంవత్సరాలు గడిచిన ప్లాస్టిక్ భూమిలో క్షీణించదు. దీనివల్ల భూమి సారవంతం కోల్పోతుంది. మానవాళికి కూడా ఎంతో ప్రమాదకారిగా మారింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్లాస్టిక్ బ్యాన్ చేసేశారు. గొప్ప ఆలోచన ఉండాలే కానీ చెడును కూడా మంచిగా మార్చొచ్చు అంటారు. గుట్టల్లా పేరుకుపోయిన ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను ఏం చేయాలి అనేదానిపై సైంటిస్టులు బుర్రలు పగిలేలా పరిశోధనలు చేశారు.


చివరికి ఓ అద్భుతమైన ఐడియా తట్టింది. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ఇంధనం పుట్టిస్తే ఎలా ఉంటుందనేదానిపై పరిశోధనలు చేశారు. రీసైక్లింగ్ ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ఇంధనం తయారు చేయొచ్చునని కనిపెట్టారు. ప్యూర్డ్యూ యూనివర్శటీ సైంటిస్టులు ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి కొత్త కెమికల్ టెక్నిక్ ను గుర్తించారు. పాలిప్రొపిలిన్‌ సాంద్రతను రీసైక్లిలింగ్ ప్రాసెస్ తో కేంద్రీకరించి 100 శాతం శుద్దమైన ఇంధనాన్ని తయారు చేయొచ్చునని పరిశోధకులు తెలిపారు. 
 

టాయ్స్ నుంచి చిప్ ప్యాకెట్ల వరకు ప్లాస్టిక్ ను సేకరించి అత్యధిక స్థాయి ఉష్ణోగ్రతతో నీటిలో మరిగించారు. సూపర్ క్రిటికల్ వాటర్ ను వినియోగించారు. ఈ వాటర్ లో కొంచెం లిక్విడ్, గ్యాస్ తోపాటు ప్రెజర్, హైటెంపరేచర్ ఉంటుంది. ఈ స్థితిలో మరిగించిన మిశ్రమాన్ని లిక్విడ్ ఆయిల్ గా మార్చవచ్చు. ప్లాస్టిక్ వ్యర్థాలనుంచి తీసిన లిక్విడ్ ఆయిల్.. పెట్రోల్, డీజిల్ తరహాలో ఉంటుంది. భవిష్యత్తులో ఇంధనంగా వాహనాల్లో ఈ లిక్విడ్ ఆయిల్ నే వాడొచ్చు.దీనివల్ల పర్యావరణ కాల్యుషంతో పాటు వాయి కాలుష్యాన్ని కూడా నియంత్రించవచ్చునని లిండా వాంగ్ అనే పరిశోధకుడు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భూగ్రహంపై ఐదు బిలియన్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పుట్టుకొస్తున్నాయని, ఇందులో 23 శాతం పాలిప్రొపిలిన్ ఎక్కువ శాతం ఉందని అన్నారు. ఈ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి ఇంధనంగా తయారుచేయడం వల్ల పర్యావరణంలోని ప్లాస్టిక్ పూర్తిస్థాయిలో నిర్మూలించే అవకాశం ఉంటుందని తమ పరిశోధనలో తేలినట్టు పరిశోధకులు తెలిపారు. 

Read Also :  ఉగ్రవాదానికి పర్యాయపదంగా పాక్ : ప్లేస్, టైమ్ ఫిక్స్ చేస్తున్నారు
Read Also :  మోడీని నమ్మలేం : జవాన్ కుటుంబ సభ్యులు

 

Scientists
Plastic waste
Fuel
petrol
diesel     

మరిన్ని వార్తలు