జూన్ 12 తెరుచుకోనున్న స్కూళ్లు

Submitted on 24 May 2019
Schools start June 12 In Telangana State

జూన్ 12న తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్లు తెరచుకోనున్నాయి. జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులను పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో పాఠశాలలు ఎప్పటి నుండి తెరవాలనే దానిపై తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ సెక్రటరీ జనార్ధన్ రెడ్డి 2019, మే 24వ తేదీ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో అత్యధికంగా 46 డిగ్రీల మేర టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. వడగాల్పులు కూడా అధికంగా వీస్తున్నాయి. వడదెబ్బల కారణంగా పలువురు మృతి చెందుతున్నారు. ఈ తరుణంలో స్కూళ్లను తెరిస్తే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతారనే అభిప్రాయాలు వినిపించాయి. దీంతో విద్యాశాఖ పై విధంగా నిర్ణయం తీసుకుంది. 

రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఏప్రిల్ 13వ తేదీ నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్ మొదటి వారంలో బడిబాట కార్యక్రమం కూడా ఉంటుందని వెల్లడించారు అధికారులు. ప్రస్తుతం సెలవులు పొడిగించడంతో బడిబాట కార్యక్రమం కూడా పోస్ట్ పోన్డ్ కానుంది. 

Schools
start
June 12
Telangana state
Telangana Education
Education News

మరిన్ని వార్తలు