SBI కొత్త ఆప్షన్ : కార్డు లేకుండా ATM నుంచి విత్ డ్రా

Submitted on 16 March 2019
SBI Yono Cash Withdraw Cash Without ATM Cards

ఏటిఎమ్‌ కార్డు లేకుండా ఏటిఎమ్‌  డబ్బులు డిపాజిట్ చేయవచ్చు. ఎస్‌బీఐ ఏటిఎమ్‌లలో ఇటువంటి సౌకర్యం ఉంది. అయితే ఏటిఎమ్‌ కార్డు లేకుండా డబ్బులు తీసుకోవచ్చా? యస్.. ఈ అవకాశం ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఇస్తుంది. ఎస్‌బీఐ తమ డిజిటల్‌ బ్యాంకింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ యోనోపై ద్వారా ‘యోనో క్యాష్‌’ పేరుతో ఈ అవకాశాన్ని కలిగిస్తుంది. 
Read Also :PubG ఫ్యాన్స్ రిలాక్స్: గేమ్ బ్యాన్ చేయడం అంత ఈజీ కాదు!
-యోనో క్యాష్‌తో దేశవ్యాప్తంగా ఉన్న 16,500కు పైగా ఎస్‌బీఐ ఏటిఎమ్‌లలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 
-‘యోనో క్యాష్‌’  ద్వారా అన్నీ ఏటిఎమ్‌లలో కార్డు లేకుండా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.
-16 వేల 500 ఏటిఎమ్‌లలో మొదట ఈ అవకాశం ఉండగా వాటిని 60వేలకు త్వరలో ఎస్‌బీఐ పెంచనుంది.
-ఈ యోనో యాప్ ద్వారా డబ్బు తీసుకోవాలంటే యాప్‌ ద్వారా డబ్బు తీసుకునేందుకు మొదట నమోదు చేసుకోవాలి.
- ఆ యోనో యాప్‌కు ముందే ఒక ఆరు అంకెల సెక్యురిటీ పిన్‌ను పెట్టుకోవాలి 
- ఆ పిన్‌ను ఎంటర్ చేయగానే ఒకవేళ డబ్బు అకౌంట్‌లో ఉంటే ఆరు అంకెల ఓటీపీ నంబర్‌ను బ్యాంక్‌ అకౌంట్‌కు లింక్ చేసిన నంబర్‌కు పంపిస్తారు. 
- ఆ ఓటీపీ ఎటిఎమ్ సెంటర్‌లలో ఎంటర్ చేసిన వెంటనే మనకు డబ్బు ఏటిఎమ్ నుండి వస్తుంది.
- ఓటీపీని 30నిమిషాలలో ఎంటర్ చేయవలసి ఉంటుంది. 30 నిమిషాలలో చేయకుండా ఓటీపీ ఎక్స్‌పైర్ అయిపోతుంది
డెబిట్ కార్డుల ద్వారా చలామనిని తగ్గించాలనే ఆలోచనతో ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఎస్‌బీఐ చెప్పింది. కార్డును జేబుల్లో పెట్టుకుని అవి పాడయితే ఏటీఎమ్ కార్డు ద్వారా డబ్బులు తీసుకోవడానికి కష్టం అవుతున్నదని ఇబ్బంది పడేవారికి ఈ నిర్ణయం మేలు చేస్తుందని భావిస్తున్నారు. ఇటువంటి సేవలను ఉపయోగించిన తొలి బ్యాంకు ఎస్‌బీఐ అని ఆ బ్యాంకు అధికారులు తెలిపారు.
Read Also : మన బడ్జెట్ లో : రూ.10వేల లోపు.. టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే..

SBI
Yono Cash
Withdraw
Cash
Without
ATM Cards

మోడీ Vs చంద్రబాబు రాజకీయ యుద్ధం వల్ల ఏపీకి న్యాయం జరుగుతుందా?

Choices

మరిన్ని వార్తలు