వరల్డ్ బ్యాంకు ఎండీగా అన్షులా కాంత్ నియామకం

Submitted on 13 July 2019
SBI MD Anshula Kant appointed as MD, CFO of World Bank Group

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) మేనేజింగ్ డైరెక్టర్ (MD) అన్షులా కాంత్ ప్రపంచ బ్యాంకు MD, CFOగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని వరల్డ్ బ్యాంకు గ్రూపు ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్ ప్రకటించారు. ప్రపంచ బ్యాంకులో రిస్క్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ బాధ్యతలను కాంత్ చేపట్టనున్నారు. ప్రస్తుతం కాంత్.. SBI బ్యాంకులో మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. గతంలో SBI చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా కూడా అన్షులా కాంత్ సేవలు అందించారు.

‘భారతీయురాలైన అన్షులా కాంత్‌ను ప్రపంచ బ్యాంకు ఎండి, సిఎఫ్‌ఓగా నియమించడం చాలా సంతోషంగా ఉంది. అన్షులాకు ఫైనాన్స్, బ్యాంకింగ్‌లో 35 సంవత్సరాల అనుభవం ఉంది. SBIలో CFOగా విధులు నిర్వర్తిస్తూనే మెరుగైన సాంకేతికను వినూత్న పద్ధతిలో అందించిన నైపుణ్యం ఆమెకు ఉంది. నాయకత్వ సవాళ్లను ఎదుర్కోవడంలో ఎంతో నైపుణ్యం ఉంది.

రిస్క్, ట్రెజరీ, ఫండింగ్, రెగ్యులెటరీ వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించగలరు’ అని మాల్పాస్ తెలిపారు. అన్షులాకు ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమెకు సాధారణ నిర్వాహణ వ్యవహారాలతో పాటు ఫైనాన్షియల్ రిపోర్టింగ్, రిస్క్ మేనేజ్మెంట్‌ బాధ్యతలను అప్పగించబోతున్నట్టు ఆయన తెలిపారు.  

లేడీ శ్రీరాం కాలేజ్ ఫర్ విమెన్ నుంచి ఎకనమిక్స్ హానర్స్ లో అన్షులా కాంత్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కాంత్ పూర్తి చేశారు. 1960లో జన్మించిన అన్షులా కాంత్.. 1983లో SBI బ్యాంకులో PO అధికారిగా సేవలు అందించారు. 

SBI
MD Anshula Kant
 MD
CFO
World Bank Group

మరిన్ని వార్తలు