సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్

Submitted on 15 June 2019
Sarpanch And Upa Sarpanch Have Check Power

తెలంగాణ పంచాయితీరాజ్ చట్టం 2018లో మరికొన్ని సెక్షన్లను చేరుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రామ పంచాయతీల చెక్ పవర్‌కు సంబంధించి జూన్ 15వ తేదీ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది.  ప్రభుత్వం సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ కల్పించింది. గ్రామ పంచాయతీల్లో అడిటింగ్ బాధ్యతలను సర్పంచ్‌,  పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. జూన్ 17, 2019 నుంచి కొత్త సెక్షన్లు అమలులోకి రానున్నాయి.

పంచాయతీ ఎన్నికల్లో గెలిచినా చెక్ పవర్ ఇవ్వకపోవడంపై సర్పంచ్‌‌‌‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధులు విడుదలైనా వాటిని వాడలేకపోతున్నామని, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం సర్పంచ్‌..ఉపసర్పంచ్‌లకు చెక్ పవర్ అధికారం ఉంటుందని సంకేతాలు వెలువడ్డాయి. దీంతో అయితే కొన్ని రోజులుగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదు. తాజాగా ప్రభుత్వం నుండి నోటిఫికేషన్ జారీ కావడంతో సంతోషం వ్యక్తమౌతోంది. 

Sarpanch And Upa Sarpanch
Check Power
Telangana Gram Panchayat Election

మరిన్ని వార్తలు