మరో మైలురాయిని చేరిన మహేష్ మూవీ

Submitted on 21 January 2020
sarileru neekevvaru collected 200 crores at box office

సంక్రాంతి కానుక‌గా జనవరి 11న విడుద‌లైన సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తూ.. స్ట్రాంగ్ క‌లెక్ష‌న్స్‌తో దూసుకుపోతుంది. ఇప్ప‌టికే రూ.200 కోట్ల రియ‌ల్ గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను సాధించి సంక్రాంతి రియ‌ల్ ఛాంపియ‌న్‌గా నిలిచింద‌న్నారు ప్ర‌ముఖ నిర్మాత అనిల్ సుంక‌ర‌.

Image

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా దిల్ రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో, జి.ఎం.బి ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనిల్‌ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో.. రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మించిన అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’.. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో ప్రొఫెస‌ర్ భార‌తీగా లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టించారు.


Read Also : నా ప్రాణం తొలి గానం పాడే వేళ - ‘జాను’ బ్యూటిఫుల్ మెలోడి

Image

సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద సరికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తోంది.. ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ నిర్మాత‌ అనిల్ సుంకర మాట్లాడుతూ : ‘సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ ప్రేక్ష‌కుల, అభిమానుల‌ అపూర్వ ఆద‌ర‌ణతో బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తూ మ‌హేశ్ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. మా చిత్రాన్నిఇంత గొప్ప‌గా ఆద‌రిస్తున్న‌ ప్రేక్ష‌కుల‌కు, సూప‌ర్ స్టార్ కృష్ణ మ‌రియు మ‌హేశ్ అభిమానుల‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు’ అన్నారు.

Mahesh Babu
Rashmika
DSP
AK Entertainments
Anil Ravipudi

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు