అన్నింటితో పాటు టీమిండియా ఒకటి అంతే.. : పాక్ కెప్టెన్

Submitted on 22 April 2019
Sarfraz Ahmed warning to Virat Kohli and Co for World Cup clash

వరల్డ్ కప్ 2019 రాబోతున్న క్రమంలో జట్ల మధ్య సవాళ్లు మొదలైయ్యాయి. పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ప్రపంచ నెం.1 జట్టు అయిన టీమిండియాను అన్నింటితో పాటు అదొకటి అనే రీతిలో మాట్లాడి తూలనాడాడు. ఇప్పటికే వరల్డ్ కప్‌లో పాల్గొనదలచిన జట్లు తమ స్క్వాడ్‌లను ప్రకటించేశాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా సర్ఫరాజ్ అహ్మద్‌ను కెప్టెన్‌గా ప్రకటిస్తూ.. 15మందితో కూడిన జట్టును ప్రకటించింది. 

ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్ 2019కు ముందు ఇంగ్లాండ్‌తో 4వన్డేల సిరీస్ ఆడనున్న పాకిస్తాన్ ప్రాక్టీసులో మునిగిపోయింది. ఈ ప్రాక్టీసు తమ వరల్డ్ కప్‌కు ఉపయోగపడుతుందని భావిస్తున్న సర్ఫరాజ్.. ఈ విధంగా మాట్లాడాడు. 'ఓ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా నాకు అన్ని మ్యాచ్‌లు ఒకటే. కేవలం ఇండియాతోనే కాదు, ప్రతి జట్టుపైనా గెలవాల్సి ఉంది'

'ప్రతి ఒక్కరూ పాకిస్తాన్.. భారత్‌పైన గెలవాలని కోరుకుంటున్నారు. మేం మాత్రం వరల్డ్ కప్ టోర్నీలో అన్ని జట్లతో ఆడినట్లే ఇండియాతోనూ పోరాడతాం. అఫ్ఘనిస్తాన్‌తో ఆడినట్లే భారత్‌తో కూడా ఆడతాం. అన్ని జట్లతోనూ ఒకే రకంగా సత్తా చాటుతాం. వరల్డ్ కప్ టోర్నీలో భారత్‌తో అన్ని మ్యాచ్‌లు ఓడిన మాట వాస్తవమే. కానీ, కొన్ని మ్యాచ్‌లలో భారత్‌ను భారీ తేడాతో ఓడించాం. మళ్లీ అది రిపీట్ చేస్తాం' అని తెలిపాడు. 

Sarfraz Ahmed
Virat Kohli
2019 icc world cup
world cup 2019
Team India
Pakistan
cricket

మరిన్ని వార్తలు