సంక్రాంతి : ఖాళీగా సిటి రోడ్లు

Submitted on 15 January 2019
Sankranti Effect No Traffic In Hyderabad Roads

హైద‌రాబాద్ : న‌గ‌రంలో ప్రయాణం చేయాలంటే చిర్రెత్తుకొస్తుంటుంది. గంటల కొద్ది ట్రాఫిక్‌...నరకయాతనతో ఇబ్బందులు పడుతుంటారు. కానీ రెండు రోజులుగా నగర రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. చాలా ప్రశాంతంగా..వేగంగా ప్రయాణిస్తున్నారు. ఎందుకంటే సంక్రాంతి పండుగ సందర్భంగా నగరంలో నివాసం ఉంటున్న కొంతమంది వారి వారి స్వగ్రామాలకు పయనమయ్యారు. దీనితో సిటి రోడ్లు ఖాళీగా మారాయి. వ‌రుస సెల‌వుల కార‌ణంగా ప‌ట్నం ప‌ల్లెకు వ‌ల‌సెల్లింది. దాంతో సిటిలో ట్రాఫిక్ ఇబ్బందులు లేవు. 
నిత్యం న‌గ‌రంలోని అనేక కూఢళ్ల‌తో పాటు వివిధ ప్రాంతాల్లో వాహ‌నాల ర‌ద్దీ కార‌ణంగా భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఎర్పడుతాయి. కొద్దిదూరం వెళ్లడానికే గంటల సమయం పడుతూ ఉంటుంది. నిత్యం ట్రాఫిక్ చిక్కుల్లో ఇబ్బందులు ప‌డ్డ‌వారు సిటిలో చాలా ప్ర‌శాంతంగా..., వేగంగా ప్ర‌యాణం చేస్తున్నామంటున్నారు. పండ‌గ నేప‌థ్యంలో సిటిలో ఉన్న వారు కూడా త‌క్కువ మందే రోడ్డు పైకి వ‌స్తున్నారు. దాంతో ఆర్టీసీ బ‌స్సులు కూడా చాలా వ‌ర‌కు ఖాళీగా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. రెగ్యుల‌ర్ డెస్‌లో ఉండే ట్రాపిక్‌తో పోలిస్తే ప్ర‌స్తుతం 30శాతం మాత్ర‌మే ట్రాఫిక్ రోడ్ల‌పై ఉండంటున్నారు ట్రాఫిక్ పోలిసులు. సోంత ఊళ్ల‌కు వెళ్ల‌డంతో హైద‌రాబాద్ రోడ్ల‌లో వాహ‌నాల సంఖ్య కూడా పెద్ద సంఖ్య‌లో త‌గ్గింది. రోడ్ల‌పై ర‌ణ‌గోణ ద్వ‌నుల‌తోపాటు.. వాహ‌న పొల్యూష‌న్ కూడా లేదు.  

Sankranti
effect
Traffic
Hyderabad Roads
Traffic Jam
Festival Session
Traffic Free

మరిన్ని వార్తలు