నగరవాసులకు స్వీట్ న్యూస్ : రెడిమేడ్ విలేజ్ మిఠాయిలు సిద్దం

Submitted on 12 January 2019
Sankranthi Festival Special

నగర మహిళలకు కష్టపడే పని లెకుండా. నగరం ముంగిట రెడిమేడ్ గ్రామీణ వంటకాలు, మిఠాయిలు సిద్దం...  
నేతి అరిసెలు:
సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేది నేతి అరిసెలు సంక్రాంతి పండుగకు ధాన్యం ఇంట్లో ఉంటుంది కాబట్టి... కొత్త బియ్యంతో వీటిని తయారు చేస్తారు. రోట్లో బియ్యం పిండి కొట్టి దాని ద్వారా నేతి అరిసెలు చేస్తారు. ఇది పల్లెల్లో కనిపించే వాతావరణం అయితే నగరంలో ఇలాంటి వాతావరణం మచ్చుకు కూడా కనిపించదు. అంతా రెడీమేడ్ స్వీటు షాపుల్లో ప్రస్తుతం అరిసెలు సిద్ధంగా ఉన్నాయి. చూడగానే నోరూరించే కమ్మని వాసన వెదజల్లుతున్నాయి. 
పూర్ణాలు, బొబ్టట్లు:
పండుగ రోజు సంప్రదాయ వంటకాల్లో అరిసెల తరువాత  పూర్ణాలు, బొబ్బట్లదే హవా. వీటి తయారీకి మొదట పూర్ణం తయారు చేసుకోవాలి. ఇందుకు కూడా రోలు, రుబ్బుడు గుండు అవసరమే యితే ఎలక్ట్రానిక్ వస్తువుల్లో గ్రైండర్‌ లభిస్తుండడంతో చాలా మంది దీనిని ఉపయోగిస్తున్నారు. పూర్ణాలు, బొబ్బట్ల తయారీకి అవసరమైన పూర్ణాన్ని గ్రైండర్‌లో చేస్తున్నారు. వీటిని పలు ప్రాంతాల్లో పలు రకాల పేర్లతో పిలుస్తారు. కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లో పూర్ణాలు, బొబ్బట్లు అని, రాయలసీమ  ప్రాంతాల్లో భక్ష్యాలు, ఓలిగలు అని వ్యవహరిస్తారు. ప్రస్తుతం వీటిని నగరంలోని పలు స్వీట్‌ షాపుల్లో విక్రయిస్తున్నారు. ముందు ఆర్డర్‌ ఇస్తే కావాల్సిన సమయానికి హాట్‌హాట్‌గా వీటిని చేయించి ఇస్తారు. 
ఇతర పిండి వంటకాలు:
సంక్రాంతి రుచుల్లో అరిసెలు, పూర్ణాలు, బొబ్బట్లతో పాటు పులిహోరా, చక్రపొంగలి, పాలతాలికలు, గారెలు, ఆహార ప్రియుల జిహ్వకు వివిధ రుచులను చూపించడానికి ఇప్పటికే మోనూలు సిద్ధం చేశారు.  లంచ్‌, డిన్నర్‌లలో ప్రత్యేక మోనూలు ప్రవేశ పెడుతున్నారు. ఇందులో కూడా సంక్రాంతి రుచులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పండుగ వేళ సంప్రదాయ రుచులను అందించడానికి హోటళ్లు తయారవుతున్నాయి. 
దుకాణంలో ధరలు(కేజీకి)
బొబ్బట్లు, పూర్ణాలు(రూ.200)
నువ్వుల అరిసెలు, సాదా అరిసెలు(రూ.200)
జంతికలు(రూ.160)
చక్కెరపొంగలి(రూ.180)
నువ్వుల లడ్డు(రూ.200)
సున్నుండలు(రూ.260)

Sankranthi Holidays
Sankranthi festival
Food Items

మరిన్ని వార్తలు