శాంసంగ్ గెలాక్సీ S20 ఫోన్లలో అలాంటి క్వాలిటీ రికార్డింగ్

Submitted on 13 February 2020
Samsung's Galaxy S20 phones have a 5-minute recording limit for 8K video

సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ s సిరీస్ నుంచి మూడు కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. 5G నెట్ వర్క్ సపోర్ట్ చేసే ఈ గెలాక్సీ S సిరీస్ ఫోన్లలో కెమెరా ఫీచర్లు ఫుల్ ఎట్రాక్టీవ్‌గా ఉన్నాయి. ప్రత్యేకించి శాంసంగ్ గెలాక్సీ S20లో ఒక ఫీచర్ యూజర్లను కట్టిపడేస్తోంది. అదే.. 8K రెజుల్యుషన్ ఫీచర్. ఈ ఫీచర్ ద్వారా 5 నిమిషాల పాటు ఏకధాటిగా వీడియోను రికార్డు చేయొచ్చు.

హైక్వాలిటీ రెజుల్యుషన్ వీడియోను రికార్డు చేయాలంటే దానికి స్టోరేజీ స్పేస్ కూడా అధికమొత్తంలో ఉండాలి. శాంసంగ్ కంపెనీ ప్రకారం.. 8K రెజుల్యుషన్ వీడియోను నిమిషం పాటు రికార్డు చేయాలంటే ఆ ఫోన్లో 600MB స్టోరేజీ అవసరం. శాంసంగ్ గెలాక్సీ S20 ఫోన్లలో 5 నిమిషాల పాటు 8K వీడియోను రికార్డు చేసుకోవచ్చు. 5 నిమిషాల 8K వీడియోకు 3GB స్టోరేజీ వరకు సరిపోతుంది. 

హై స్టోరేజీ అవసరమైతే.. గరిష్టంగా 8K వీడియోల రికార్డింగ్ సమయాన్ని 5 నిమిషాలకు శాంసంగ్ పరిమితం చేసినట్టు శామ్ మొబైల్స్ రిపోర్టు తెలిపింది. 24 ఫ్రేమ్‌ల్లో మాత్రమే 8K వీడియోలను రికార్డు చేసేందుకు పరిమితి ఉంది. అదే క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 865, శాంసంగ్ సొంత Exynos 990 చిప్‌ ప్రాసెసర్లల్లో అయితే.. 8K వీడియోలకు 30 ఫ్రేమ్స్ వరకు సపోర్ట్ చేస్తాయి. కానీ, గెలాక్సీ S20 సిరీస్ ఫోన్లలో ఈ ఆప్షన్ ఇంకా ఎనేబుల్ చేయలేదు. 

శాంసంగ్ S సిరీస్ ఫోన్లలో గెలాక్సీ S20 Ultra లేదా గెలాక్సీ S20+ వేరియంట్లలో 512GB స్టోరేజీ వేరియంట్ ఉన్నప్పటికీ పెద్దగా అవసరం కాకపోవచ్చు. మైక్రోSD కార్డ్ 1TB వరకు సపోర్ట్ చేసుకోవడమే కాదు.. అదనంగా యాంపిల్ ఆన్ బోర్డు స్టోరేజీ కూడా ఉంది. దీని అర్థం.. మొత్తం మీ గెలాక్సీ S20+, గెలాక్సీ S20 అల్ట్రా ఫోన్లలో 1.5TB స్టోరేజీ ఉంటుంది. అంటే.. మీ ఫోన్లో వందలాది 8K వీడియోలను రికార్డు చేసుకోవచ్చు. 

Samsung's Galaxy S20
5-minute recording limit
8K video
SamMobile reports  

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు