Samsung+Netflix : గెలాక్సీ యూజర్లకు ఎక్స్‌క్లూజీవ్ కంటెంట్

Submitted on 12 February 2020
Samsung-Netflix collab brings exclusive content to Galaxy owners

ప్రస్తుతం ఆన్‌లైన్‌లో OTT ప్లాట్ ఫాంపై స్ట్రీమింగ్ కంటెంట్ యాప్స్‌కు ఫుల్ డిమాండ్ ఉంది. ప్రపంచ స్ట్రీమింగ్ దిగ్గజం Netflix గురించి ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. స్ట్రీమింగ్ కంటెంట్ ఖరీదైనది కూడా. అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, జీ5 వంటి ఎన్నో స్ట్రీమింగ్స్ అందుబాటులో ఉన్నాయి.

నెట్ ఫ్లిక్స్ సర్వీసు యాక్సస్ చేసుకోవాలంటే ఇతర యాప్స్ తో పోలిస్తే కాస్త ఖరీదైనదిగా చెప్పవచ్చు. అలాంటి బెస్ట్ క్వాలిటీ స్ట్రీమింగ్ కంటెంట్ అందిస్తున్న నెట్ ఫ్లిక్స్ యాక్సస్ చేసుకునేందుకు శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్లు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. శాంసంగ్ గెలాక్సీ యూజర్లు ఎవరైనా ఈజీగా నెట్ ఫ్లిక్స్ యాక్సస్ చేసుకోవచ్చు. ప్రత్యేకించి నెట్ ఫ్లిక్స్ సర్వీసు గెలాక్సీ యూజర్ల కోసం ఎక్స్ క్లూజీవ్ కంటెంట్ ఆఫర్ చేస్తోంది. 

ఇటీవలే శాంసంగ్, నెట్ ఫ్లిక్స్ సర్వీసు ప్రొవైడర్లు శాన్ ఫ్రాన్సిస్‌కో‌లో చేతులు కలిపాయి. ఈ రెండు కంపెనీల  భాగస్వామ్యంతో నెట్ ఫ్లిక్స్ ఎక్స్ క్లూజీవ్ కంటెంట్ ను గెలాక్సీ యూజర్లకు ఆఫర్ చేస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. నెట్ ఫ్లిక్స్ అందించే ఈ ఎక్స్ క్లూజీవ్ వీడియో కంటెంట్‌ను గెలాక్సీ S20 బ్యాక్ కెమెరాతోనే ఫిల్మ్ డైరెక్టర్లు క్యాప్చర్ తీస్తున్నారంట. 

కెమెరాల కాన్ఫిఫిగరేషన్స్ విషయానికి వస్తే.. లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్లలో కంపెనీ ఎంతగా విశ్వాసంగా ఉందో కనిపిస్తోంది. ఇక ఎక్స్ క్లూజీవ్ నెట్ ఫ్లిక్స్ కంటెంట్.. శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ యూజర్లకు మాత్రమే యాక్సస్ చేసుకునే వీలుంది.

ఈ కొత్త భాగస్వామ్యంలో స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంపై శాంసంగ్ తో అనుసంధానమైన డిస్కవరీ ప్లాట్ ఫాంల్లో Bixby, Daily, Finder కూడా మరింత ప్రయోజనం చేకూరనుంది. దీంతో యూజర్లు తమ ఫావరేట్ షోల కోసం సెర్చ్ చేసేందుకు ఎంతో సులభంగా ఉంటుంది. 

Samsung-Netflix
exclusive content
Galaxy owners

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు