ఎట్రాక్టీవ్ ఫీచర్లు : భారీ బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ M30s

Submitted on 19 September 2019
 samsung launches galaxy m30s india massive 6000mah battery

సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి కొత్త వేరియంట్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయింది. గెలాక్సీ M సిరీస్ ఫోన్లలో రెండు వేరియంట్లు ఇండియన్ మార్కెట్లలో లాంచ్ అయ్యాయి. భారీ బ్యాటరీ 6000mAh సామర్థ్యంతో శాంసంగ్ గెలాక్సీ M30, M30s మోడల్స్ హైలెట్ గా నిలిచాయి. టాప్ ఎండ్ స్పెషిఫికేషన్లతో యూజర్లను ఎట్రాక్ట్ చేసేలా ఉంది. శాంసంగ్ గెలాక్సీ M30s మోడల్ స్మార్ట్ ఫోన్ లో కీలక ఫీచర్లలో 6.4 అంగుళాల సూపర్ AMOLED ఇన్ఫినిటీ U డిస్‌ప్లే ఉంది. 

స్క్రీన్ రేషియో 91శాతం ఉండగా, పీక్ బ్రైట్ నెస్ 420నిట్స్ వరకు ఉంటుంది. శాంసంగ్ మోడల్ ఫోన్లలో ఐదో ఇన్ హౌస్ ఎక్సినోస్ 9611 ఆక్టా కోర్ ప్రాసెసర్ వినియోగించారు. మాలి G-72 MP3 GPU గ్రాఫిక్స్ సపోర్ట్ కూడా ఉంది. RAM విషయానికి వస్తే.. రెండు వేరియంట్లు 4GB, 6GB ఉండగా.. ఇంటర్నల్ స్టోరేజీ 64GB, 128GB సామర్థ్యం ఉంది. అదనపు స్టోరేజీ 512GB కోసం మైక్రో SD కార్డు ఆఫర్ చేస్తోంది. ఒక UI ఆధారిత ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది. 

కెమెరా సెక్షన్ లో.. ట్రిపుల్ కెమెరా సెటప్ స్పెషల్ ఎట్రాక్షన్ గా చెప్పుకోవాలి. 48MP ప్రైమరీ కెమెరాతో 5MP డెప్త్ సెన్సార్ టాప్ లో ఉంది. 8MP వైడ్ యాంగిల్ కెమెరాతో వర్టికల్ లైన్ కింద ఉంది. మరికొన్ని ఫీచర్లు నైట్ మోడ్, అల్ట్రా వైడ్ మోడ్, బుకే ఎఫెక్ట్, లైవ్ పొర్టరైట్ తో కలిసి ఉన్నాయి. ఇతర ఫీచర్లలో 4K రికార్డింగ్, హైపర్ లాప్స్, సూపర్ స్లో మోషన్ కూడా యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ M30s (ఒపాల్ బ్లాక్, సప్ హైర్ బ్లూ, పెరల్ వైట్) మొత్తం మూడు కలర్లలో వచ్చింది. బిగ్ బ్యాటరీ 6,000mAh 15W Type-C ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది.

బ్యాటరీ ఛార్జింగ్ సమయంలో 29 గంటల వీడియో ప్లేబ్యాక్, 49గంటల వాయిస్ కాల్స్ సామర్థ్యం ఉంది. ప్లే మ్యూజిక్ ఒకటే వాడితే 130 గంటల వరకు బ్యాటరీ ఛార్జింగ్ తగ్గకుండా అలానే ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ M30s (4GB +64GB) ధర రూ.13వేల 999గా నిర్ణయించగా.. మరో వేరియంట్ ధర రూ.16వేల 999గా కంపెనీ నిర్ణయించింది. ఈ కామర్స్ వెబ్ సైట్ అమెజాన్, శాంసంగ్ వెబ్ సైట్లలో రెండు ప్లాట్ ఫాంలో నుంచి ఈ కొత్త స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. సెప్టెంబర్ 29 నుంచి ఫోన్ సేల్స్ ప్రారంభం కానున్నాయి. 

ఫీచర్లు - స్పెషిఫికేషన్లు ఇవే :
* 6000mAh భారీ బ్యాటరీ సామర్థ్యం
* 6.4 అంగుళాల సూపర్ AMOLED ఇన్ఫినిటీ U డిస్‌ప్లే
* స్క్రీన్ రేషియో 91శాతం
* RAM : 4GB + 6GB 
* ఇంటర్నల్ స్టోరేజీ : 64GB + 128GB
* అదనపు స్టోరేజీ 512GB (Micro SD కార్డు)
* UI ఆధారిత ఆండ్రాయిడ్ 9.0 పై OS
* ట్రిపుల్ కెమెరా సెటప్
* 48MP ప్రైమరీ కెమెరా
* 5MP డెప్త్ సెన్సార్ (టాప్) 
* 8MP వైడ్ యాంగిల్ కెమెరా (వర్టికల్ లైన్) 
* 4K రికార్డింగ్, హైపర్ లాప్స్, సూపర్ స్లో మోషన్
* Type-C ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్

Samsung
galaxy m30s
india
6000mah battery
triple camera setup

మరిన్ని వార్తలు