ఫీచర్లు చూస్తే ఫిదానే : శాంసంగ్ గెలాక్సీ కొత్త ఫోన్లు ఇవే!

Submitted on 12 February 2020
Samsung Galaxy S20, Galaxy S20+ and Galaxy S20 Ultra launched, new cameras and 100X zoom in focus

సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి మూడు టాప్ ఎండ్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చేశాయి. హైఎండ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ మార్కెట్లో శాంసంగ్ ప్రపంచవ్యాప్తంగా ఈ కొత్త శాంసంగ్ గెలాక్సీ S20, S20+,S20 అల్ట్రా స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టింది.

రానున్న వారాల్లో భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సేల్స్ ప్రారంభం కానుంది. ఈ మూడు ఫోన్లలో గెలాక్సీ S20, గెలాక్సీ s20+ మోడల్స్.. గెలాక్సీ S10, S10+ వేరింయట్లకు అప్ గ్రేడ్ వెర్షన్. ఇక గెలాక్సీ S20 అల్ట్రా అనేది సిరీస్ ఫోన్లలో ఒక స్పెషల్ వేరియంట్. కొత్త కెమెరా మాడ్యుల్ తో వచ్చేసింది. 108MP ఇమేజ్ సెన్సార్ తో పాటు ఆప్టికల్, డిజిటల్ జూమ్ టెక్నాలజీతో  100X వరకు జూమ్ చేసుకోవచ్చు. 

మూడు వేరియంట్లలో గెలాక్సీ S20 Ultra ఫోన్ 6.9 అంగుళాలతో అదిపెద్ద స్ర్కీన్. 16GB ర్యామ్ గరిష్టంగా ఉంది. మార్కెట్లో ఈ మోడల్ ప్రారంభ ధర 1,399 (రూ. 99,647) డాలర్లగా నిర్ణయించింది. గెలాక్సీ S20+ వేరియంట్ ప్రారంభ ధర 1,199 డాలర్లు (రూ. 85,401)గా నిర్ణయించింది. గెలాక్సీ S20 మోడల్ ధర 999 డాలర్లు (రూ.71,156)గా అందుబాటులో ఉండనుంది. ఈ మూడు గెలాక్సీ ఫోన్లలో 5G సపోర్ట్ ఉంది. 

2019 గెలాక్సీ స్మార్ట్ ఫోన్లతో పోలిస్తే 1 శాతంగా 5G సపోర్ట్ చేయగా.. 2020లో ఈ కొత్త నెట్‌వర్క్‌లో  18శాతం మేర స్మార్ట్ ఫోన్లలో 5G సపోర్ట్ అందుబాటులో ఉంటుందని శాంసంగ్ భావిస్తోంది. అన్ని S20 ఫోన్ వేరియంట్లు ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అవుతాయి. శాంసంగ్ లేటెస్ట్ వన్ UI ద్వారా కస్టమైజ్ చేశారు.

భారత మార్కెట్లలో త్వరలో మూడు వేరియంట్లు సేల్ ప్రారంభం కానుంది. గెలాక్సీ S20 లాంచ్ ఈవెంట్లో శాంసంగ్ కంపెనీ కొత్త గెలాక్సీ Buds +, కొత్త ఫొల్డబుల్ స్ర్కీన్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ Fold Z విడుదల చేసింది. మూడు s20 స్మార్ట్ ఫోన్ వేరియంట్ల ఫీచర్లు, స్పెషిఫికేషన్లు ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి. 

1) Galaxy S20 - ఫీచర్లు + స్పెషిఫికేషన్లు ఇవే :

s20

* 6.2-అంగుళాల స్ర్కీన్ ( s20)
* 4000man బ్యాటరీ , 25W ఫాస్ట్ ఛార్జింగ్
* మూడు రియర్ కెమెరాలు సెటప్
* 12MP సెన్సార్ (ప్రైమరీ కెమెరా F1.8 లెన్స్)
* 64MP సెన్సార్ (F2 లెన్స్) టెలిఫొటో లెన్స్ 
* 12MP సెన్సార్ (F2.2 లెన్స్) అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా
* 10MP సెల్ఫీ కెమెరా ఇన్ సైడ్ పంచ్ హోల్ 
* AMOLED ప్యానెల్, 120Hz రీఫ్రెష్ రేట్
* స్ర్కీన్ కింద ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ 
* మెటల్ ఫ్రేమ్, గ్లాస్ లేయర్స్
* డస్ట్ రెసిస్టెన్స్, IP68 రేటింగ్
* 24frames/సెకన్, 8K రెజుల్యుషన్ వీడియో రికార్డింగ్
* ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, కస్టమైజడ్ లేటెస్ట్ One UI

2) Galaxy S20+ ఫీచర్లు - స్పెషిఫికేషన్లు ఇవే :
s20 plus

* 6.7-అంగుళాల స్ర్కీన్
* 4500mah బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్
* రియర్ కెమెరా సిస్టమ్, ఎక్స్ ట్రా డెప్త్ సెన్సింగ్ కెమెరా
*  హైబ్రిడ్ ఆప్టికల్ జూమ్ 3X వరకు, మొత్తం జూమ్ 30X వరకు
* 12GB RAM, 512GB స్టోరేజీ, microSDతో  1TB సపోర్ట్ 
* క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్, లేదా శాంసంగ్ Exynos 990
* ఫ్రంట్ కెమెరా 10MP సెల్ఫీ కెమెరా 

3) Galaxy S20 Ultra : ఫీచర్లు + స్పెషిఫికేషన్లు ఇవే :
ultra samsung

* 6.9- అంగుళాల స్ర్కీన్, భారీ 5000 mAh బ్యాటరీ
* పెరిస్కోప్-స్టయిల్ లెన్స్, 48MP సెన్సార్, 10X హైబ్రిడ్ ఆప్టికల్ జూమ్
* 108MP ఇమేజ్ సెన్సార్ 
* రెగ్యులర్ వైడ్ యాంగిల్ లెన్స్
* అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 12MP సెన్సార్ (F2.2 లెన్స్)
* 40MP సెల్ఫీ కెమెరా (ఫ్రంట్ సైడ్) 
* 16GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజీ

Samsung Galaxy S20
Galaxy S20+
Galaxy S20 Ultra
new cameras
100X zoom

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు