ఫీచర్లు అదుర్స్ : శాంసంగ్ గెలాక్సీ నోట్ 10+ వచ్చేస్తోంది 

Submitted on 13 July 2019
Samsung Galaxy Note 10+ with punch hole display and quad rear cameras render online

సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ రానుంది. వచ్చే నెల ఆగస్టు 7న శాంసంగ్ గెలాక్సీ నోట్ సిరీస్ నుంచి కొత్త ఫోన్ లాంచ్ కానుంది. అదే..
శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్. గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్ మోడల్స్ పై లీక్స్ రావడంతో మార్కెట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శాంసంగ్ గెలాక్సీ నోట్ 1 ప్లస్ మోడల్ ఫీచర్లకు
సంబంధించి కొన్ని కీలక వివరాలను మీకోసం అందిస్తోంది..  

కొన్ని రిపోర్టుల ప్రకారం.. గెలాక్సీ నోట్ 10+ మోడల్.. S-Penతో పాటు బ్లాక్, సిల్వర్ ప్రిసమ్ రెండు కలర్లలో వస్తోంది. రెండెంటీలో డార్క్ బ్లూ కలర్, బ్లాక్ కలర్ వేరియేషన్ ఉంటుంది.
పంచ్ హోల్ డిస్ ప్లేతో పాటు క్వాడ్ రియర్ కెమెరాలు కూడా ఉన్నాయి.

ఈ ఫోన్ లో డస్ట్ అండ్ వాటర్ రిసెస్టన్స్ తో పాటు DeX, Samsung Pay కోసం  IP68 సర్టిఫికేషన్ కూడా ఉంది. మొబైల్ స్పెషిఫికేషన్ల విషయానికి వస్తే.. యూజర్లను ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ నోట్ 10+ పూర్తి ఫీచర్లు, స్పెషిఫికేషన్లు ఏంటో తెలియాంటే లాంచ్ అయ్యేవరకు ఆగాల్సిందే. 

స్పెషిఫికేషన్లు - ఫీచర్లు ఇవే : 
* 6.75 అంగుళాల QHD+ సూపర్ AMOLED డిస్ ప్లే, HDR+ ప్లేబ్లాక్
* క్వాల్ కామ్న్ స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్
* ఎక్సినోస్ 9825 ప్రాసెసర్
*8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజీ
* క్వాడ్ రియర్ కెమెరా (బ్యాక్) LED ఫ్లాష్ లైట్
* 3D ToF సెన్సార్
* 10MP డిస్ ప్లే కెమెరా, డ్యుయల్ ఫిక్సల్ PDAF
* అల్ట్రా థిన్.. అల్ట్రా సోనిక్ ఫింగర్ ఫ్రింట్ రీడర్
* బ్లూటూత్ 5.0, Wi-Fi 6, NFC, 4G LTE
* 4500mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్
* USB టైప్-C పోర్ట్ 

Samsung Galaxy Note 10+
punch hole display
quad rear cameras

మరిన్ని వార్తలు