Exchange ఆఫర్ కూడా : శాంసంగ్ గెలాక్సీ A50 ధర తగ్గిందోచ్!

Submitted on 27 May 2019
Samsung Galaxy A50 Price in India Cut, Now Starts at Sale

శాంసంగ్ గెలాక్సీ యూజర్లకు గుడ్ న్యూస్. సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ కంపెనీ.. గెలాక్సీ A సిరీస్ ధర తగ్గించింది. రెండు వేరియంట్లపై ధర (4GB ర్యామ్/64GB స్టోరేజీ) + (6GB ర్యామ్/64GB స్టోరేజీ ) వేరియంట్ల ధర రూ.15వందల వరకు తగ్గింది. శాంసంగ్ A50 రెండు వేరియంట్లతో ఇండియాలో 2019 ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. శాంసంగ్ ఏ50 సిరీస్ తొలి వేరియంట్ ప్రారంభ ధర రూ. 19వేల 990గాను, రెండో వేరియంట్ ధర రూ.రూ.22,990గా ఉండేది.

కొత్త తగ్గింపుతో ఈ 4GB ర్యామ్ వేరియంట్ ధర 18వేల 490 ఉండగా 6GB ర్యామ్ వేరియంట్ ధర రూ. 21,490లకే యూజర్లు సొంతం చేసుకోవచ్చు. ఇండియన్ మొబైల్ మార్కెట్లో సేల్స్ సునామీ సృష్టిస్తోన్న చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజాలు షియోమీ, ఒప్పో, వివోలకు పోటీగా శాంసంగ్ A సిరీస్ డిజైన్ సూపర్ AMOLED డిస్ ప్లే కంపెనీ తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అయ్యే గెలాక్సీ ఏ సిరీస్ మోడల్..  ఆక్టా-కోర్ ఎక్సినోస్ 9610SoC, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 

శాంసంగ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ లో శాంసంగ్ గెలాక్సీ A50 సిరీస్ కొత్త ధరతో అందుబాటులో ఉంది. ఆన్ లైన్ మొబైల్ సేల్ ఈ కామర్స్ మార్కెట్ దిగ్గజాలు,  అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్లలో కూడా శాంసంగ్ ఏ50 సిరీస్ రెండు వేరియంట్లు కొత్త ధరతో అందుబాటులో ఉన్నాయి. ఆన్ లైన్ లో ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. 

శాంసంగ్ A50 స్పెషిఫికేషన్లు - ఫీచర్లు :
*
డ్యుయల్ SIM (Nano) కార్డు స్లాట్ 
* ఆండ్రాయిడ్ పై, One UI టాప్ 
* 6.4 అంగుళాల ఫుల్ HD+ (1080x2340 ఫిక్సల్స్), ఇన్ఫినిటీ-U డిస్ ప్లే
* ఆక్టా-కోర్ ఎక్సినోస్ 9610 SoC
* 4GB ర్యామ్, 6GB ర్యామ్ 
* స్పోర్ట్స్ రియర్ కెమెరా సెటప్ 
* 25MP ప్రైమరీ కెమెరా సెన్సార్, ఆటో ఫోకస్ f/1.7లెన్స్
* 5MP సెకండరీ సెన్సార్, ఫిక్సడ్ ఫోకస్ f/2.2లెన్స్
* 8MP కెమెరా, f/2.0లెన్స్, 25MP సెల్ఫీ కెమెరా ఫ్రంట్ 
* 64GB ఆన్ బోర్డ్ స్టోరేజీ, మైక్రో SD కార్డ్ (512GB ఎక్స్ పాండబుల్)
* USD టైప్ C-పోర్ట్, ఫింగర్ ఫ్రింట్ సెన్సార్
* 4000mAh బ్యాటరీ, 158.5x74.7x7.7mm

Samsung Galaxy
Galaxy A50
 A50 Price in India
Starts at Sale

మరిన్ని వార్తలు