బామ్మగా లక్ష్మీ - భామగా సమంత

Submitted on 12 January 2019
Samantha Refused for Nandini Reddy Film-10TV

సమంత ప్రస్తుతం, హబ్బీ నాగ చైతన్యతో కలిసి మజిలీ మూవీ చేస్తుంది. దాని తర్వాత నందినీ రెడ్డి డైరెక్షన్‌లో ఓ సినిమా చెయ్యబోతుంది. నాగశౌర్య ఫస్ట్ టైమ్ సమంతతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండగా, సురేష్ బాబు నిర్మిస్తున్నాడు. మిస్ గ్రానీ అనే కొరియన్ మూవీ ఆధారంగా తెరకెక్కబోయే ఈ సినిమాలో మొదట సమంతనే రెండు క్యారెక్టర్లు చేద్దామనుకుంది. ఎందుకంటే మిస్ గ్రానీ వయసు రీత్యా 70 ఏళ్ళ బామ్మ, 20 ఏళ్ళ భామగా మారిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడింది అనే అంశంతో రూపొందింది. బామ్మగానూ, టీనేజ్ యువతిగానూ సమంత నటించడానికి ఎస్ చెప్పింది.

కట్ చేస్తే, బామ్మ క్యారెక్టర్ మేకప్ కోసం ప్రోస్థటిక్ మేకప్‌కి మగవాళ్ళ బాడీ తట్టుకుంటుంది కానీ, లేడీస్ స్కిన్‌పై ఎఫెక్ట్ చూపిస్తుందని డాక్టర్స్ చెప్పడంతో సమంత వెనక్కి తగ్గింది. దీంతో బామ్మ క్యారెక్టర్‌కి సీనియర్ నటి లక్ష్మిని సెలెక్ట్ చేసారు. ఆవిడైతే ఆ క్యారెక్టర్‌కి సరిగ్గా సరిపోతారని భావించి ఆమెని ఎంపిక చేసారు. ఒరిజినల్ వెర్షన్‌లోనూ, రెండు క్యారెక్టర్స్ వేరు వేరు ఆర్టిస్ట్‌లు చేసారు. ఈ సినిమాకి ఓ బేబీ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. త్వరలో సమంత, నందనీ రెడ్డి సినిమా స్టార్ట్ కాబోతుంది.

Samantha
Lakshmi
Naga Shaurya
Nandini Reddy

మరిన్ని వార్తలు