నోరు మూసుకోండి : ఘోర ఓటమితో అఖిలేష్ కీలక నిర్ణయం

Submitted on 25 May 2019
Samajwadi Party cancels appointment of all its TV panellists

లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయంతో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.టీవీ డిబేట్స్ కోసం పార్టీ అధికార ప్రతినిధులుగా నియమించబడిన పానలిస్టులందరినీ తొలగిస్తూ అఖిలేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు శుక్రవారం(మే-24,2019)పార్టీ ప్రతినిధి రాజేంద్ర చౌదరి ఓ లెటర్ ను విడుదల చేశారు.ఇప్పటినుంచి పానలిస్టులందరి నియామకం ముగిసిందని తెలిపారు.టీవీ చానల్స్ లో చర్చల కోసం పార్టీలోని ఏ ఒక్క ఆఫీస్ బేరర్ ను ఆహ్వానించవద్దని తాము కోరుతున్నట్లు తెలిపారు.తదుపరి పానలిస్టుల లిస్ట్ ను ఎస్పీ జాతీయ అధ్యక్షుడు డిసైడ్ చేస్తారని చౌదరి తెలిపారు.

అయితే ఎస్పీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించగా....ఇది పార్టీ తీసుకున్న నిర్ణయం అని,కారణాలు వెల్లడించబోవడం లేదని చౌదరి తెలిపారు.ఎస్పీ వెబ్ సైట్ లోని లిస్ట్ ప్రకారం.... 24మంది ప్రతినిధులు టీవీ పానలిస్ట్ లుగా ఉన్నారు.లోక్ సభ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేసినప్పటికీ మోడీ హవాకు ఎదురొడ్డి నిలబడలేకపోయారు.ఎస్పీ కేవలం 5స్థానాల్లో మాత్రమే విజయం సాధించగా,బీఎస్పీ 10 సీట్లతో సరిపెట్టుకుంది.

akilesh yadav
PANALISTS
TV
DISCUSSIONS
removed
UP
SPOKEPERSONS

మరిన్ని వార్తలు