దేశంతోపాటే ప్రయాణం : సల్మాన్ ఖాన్ 'భారత్' ఫస్ట్ లుక్

Submitted on 15 April 2019
salman khan first look from bharath movie

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కొత్త సినిమా భారత్ ఊహలకందని రీతిలో ఉండనుంది. దేశం మీద తనకున్న అభిమానాన్ని చాలా సినిమాల్లో చాటుకున్నాడు సల్మాన్. ఈ సినిమాలో కొత్త గెటప్‌తో కనిపించబోతున్నట్లు తెలిపినా.. ఫస్ట్ లుక్ విడుదల చేశాక అందరూ ఆశ్చర్యానికి గురైయ్యారు. అలీ అబ్బాస్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో కత్రినా కైఫ్‌, టబూ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. మరి కొద్ది రోజుల్లో టీజర్ రిలీజ్ కాబోతుండగా దాని కంటే ముందు విడుదల చేసిన ఫస్ట్ లుక్ సూపర్‌గా ఉందంటూ అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుంది. 
Read Also : చిరు వ్యాపారికి మట్టి కుండలు పంపిన ఉపాసన

సోమవారం భారత్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ విడుదల చేసి.. దాని కింద ఓ వపర్ ఫుట్ కామెంట్ పెట్టారు. ‘నా జుట్టు, గడ్డంలో ఎన్ని తెల్ల వెంటుకలు ఉన్నాయో.. అంతకంటే ఎక్కువగా నా జీవితం రంగులమయం’ అంటూ సల్మాన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్టర్‌లో సల్లూ భాయ్.. 70 ఏళ్ల వృద్ధుడిలా కనిపిస్తున్నారు.

ఈ సినిమాలో సల్మాన్ 20 ఏళ్ల వ్యక్తి గెటప్ నుంచి 70 ఏళ్ల వృద్ధుడి గెటప్ వరకు వివిధ లుక్స్‌లో కనిపించి అలరించనున్నట్లు లుక్స్ చూస్తే తెలుస్తుంది. భారత్ మూవీలో జాకీష్రాఫ్‌.. సల్మాన్‌కు తండ్రిగా నటించనున్నట్లు ప్రచారంలో ఉండగా ఫిమేల్ లీడ్ రోల్‌లో కత్రినా నటించనుంది. ఏప్రిల్ 24న సినిమా ట్రైలర్‌ విడుదల చేయనున్నారు. రంజాన్ నాటికల్లా ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. 

Salman Khan
bharath
Bollywood

మరిన్ని వార్తలు