మంచి నటిని కాదనిపించింది: సాయిపల్లవి

Submitted on 24 May 2019
Sai Pallavi Experience With Selvaraghavan Direction  NGK Movie

సాయిపల్లవి నటించింది కొన్ని సినిమాల్లోనే అయినా తనకంటూ మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. మాలీవుడ్ తో పాటు టాలీవుడ్, కోలీవుడ్ లోనూ రాణిస్తున్నారు. తాజాగా సూర్యకు భార్యగా నటించిన సినిమా 'NGK'. ఈ సినిమాలో రకుల్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించారు. మే 31న ఈ చిత్రం విడుదలకు సిధ్ధంగా ఉంది. ఈ సినిమా ప్రచారంలో సాయిపల్లవి మీడియాతో మాట్లాడుతూ..ఓ సీన్ లో తను నటించిన విధానం దర్శకుడికి నచ్చలేదని షూటింగ్ ను నెక్ట్ డే కి వాయిదా వేశారని  దీంతో తను చాలా బాధపడ్డానని తెలిపారు.

నా నటనతో సెల్వరాఘవన్‌ ఇంప్రెస్‌ అవ్వలేదు. నేను ఇంటికి వెళ్లి మా అమ్మకు విషయం చెప్పి బాగా ఎడ్చాను. నేను మంచి నటిని కాదు నేను మెడికల్ ప్రోఫెషన్ కు వెళ్లిపోతానని చెప్పేశాను. ఆ రోజంతా ఏడుస్తూనే ఉన్నాను అని చేప్పారు. దేవుడి దయతో నెక్ట్స్ డే నా తొలి టేక్ ను దర్శకుడు ఓకే చేశారు. దాంతో నేను చాలా సంతోష పడ్డాను అని చెప్పారు. 
 

Sai pallavi
Selvaraghavan
NGK Movie
2019

మరిన్ని వార్తలు