కలెక్షన్ల రికార్డ్ సృష్టిస్తున్న సాహో... మేకింగ్ వీడియో చూశారా!

Submitted on 10 September 2019
Sahoo Created New Record

సాహో టాక్ ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం దుమ్మురేపుతున్నాయి. 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా.. అదే రేంజ్ లో వసూళ్లను రాబడుతోంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల రూపాయలను రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం ఐదు రోజుల్లోనే ఈ కలెక్షన్స్ రావటం విశేషం.  అంతేకాదు పది రోజుల్లో 400 కోట్ల మార్క్‌ను అందుకుంది.

ఇక మూవీ యూనిట్ కూడా సినిమాను వార్తల్లో ఉంచేందుకు తాజాగా సాహో మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ని ఏ విధంగా తెర‌కెక్కించారో చూపించారు. అంతే కాదు హాలీవుడ్‌ కి సంబంధించిన ప‌లువురు యాక్ష‌న్ పార్ట్‌కి సంబంధించి ఎలా ప్లాన్ చేశారో కూడా వివ‌రించారు. ప్రస్తుతం ఈ వీడియో అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. 

Sahoo
Prabhas
Created New Record

మరిన్ని వార్తలు