సాహో సెకండ్ పోస్టర్ చూశారా?

Submitted on 27 May 2019
Saaho Second Poster

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా, సుజిత్ డైరెక్షన్‌లో, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం.. సాహో.. ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా రిలీజ్ డేట్ మెన్షన్ చేస్తూ సాహో న్యూ పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్, ఇప్పుడు సాహో సెకండ్ పోస్టర్ రిలీజ్ చేసింది.

గాగుల్స్‌, చెవిలో బ్లూటూత్, ఒక చేత్తో ఎక్స్‌లేటర్ రేజ్ చేస్తూ, బైక్‌పై రయ్‌య్‌న దూసుకెళ్తున్నాడు ప్రభాస్.. హిందీలో టీ-సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పిస్తున్నారు. ఈ న్యూ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. 2019 ఆగష్టు 15న తెలుగుతో పాటు హిందీ, తమిళ్ భాషల్లో సాహో రిలీజ్ కానుంది.

మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. నీల్ నితిన్ ముఖేష్, జాకీష్రాఫ్, ఎవెలిన్ శర్మ, మందిరా బేడి, వెన్నెల కిషోర్, బొమన్ ఇరానీ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా : మది, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్ : సాబు సిరిల్, వీఎఫ్ఎక్స్ : కమల్ కణ్ణన్.
 

Parbhas
Shraddha Kapoor
uv creations
Sujeeth

మరిన్ని వార్తలు