రూ.200 కోట్లకు సాహో హిందీ రైట్స్

Submitted on 27 May 2019
Saaho Hindi Rights Sold Out

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా, సుజిత్ డైరెక్షన్‌లో, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రమోద్, వంశీ నిర్మిస్తున్న మూవీ.. సాహో.. రీసెంట్‌గా రిలీజ్ డేట్ మెన్షన్ చేస్తూ సాహో న్యూ పోస్టర్స్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ్ భాషల్లోనూ రిలీజవుతున్న సంగతి తెలిసిందే. సాహో హిందీ రైట్స్‌ను ఆడియో రంగంలో అగ్రగామి అయిన ప్రముఖ టీ-సిరీస్ సంస్థ దక్కించుకుంది.

సాహో హిందీ హక్కుల కోసం భారీ పోటీ నెలకొన్న నేపథ్యంలో టీ-సిరీస్ సంస్థ అక్షరాలా రూ.200 కోట్లకు సాహో రైట్స్‌ను సొంతం చేసుకుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇంత పెద్దమొత్తం చెల్లించామని, బాలీవుడ్‌లో సాహోని భారీగా విడుదల చేస్తామని టీ-సిరీస్ యాజమాన్యం చెప్పింది. బాహుబలి రెండు పార్ట్‌లను ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ హిందీలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

2019 ఆగష్టు 15న తెలుగుతో పాటు హిందీ, తమిళ్ భాషల్లో సాహో రిలీజ్ కానుంది. నీల్ నితిన్ ముఖేష్, జాకీష్రాఫ్, ఎవెలిన్ శర్మ, మందిరా బేడి, వెన్నెల కిషోర్, బొమన్ ఇరానీ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా : మది, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్ : సాబు సిరిల్, వీఎఫ్ఎక్స్ : కమల్ కణ్ణన్.

Parbhas
Shraddha Kapoo
uv creations
Sujeeth

మరిన్ని వార్తలు