బెంగాల్ లో RSS కార్యకర్త కుటుంబం దారుణ హత్య

Submitted on 10 October 2019
RSS worker, pregnant wife, 6-yr-old son killed in Bengal’s Murshidabad

బెంగాల్ లో దారుణం జరిగింది. ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త,ఎనిమిది నెలల ప్రెగ్నెన్సీతో ఉన్న అతని భార్య, ఆరేళ్ల కొడుకు ముర్షీరాబాద్ లో దారుణ హత్యకు గురయ్యారు. వారి శరీరాలపై కత్తిపోట్లను గుర్తించారు. మృతులను ప్రకాష్ లాల్(35),బ్యూటీ పాల్(28),అంగన్ పాల్(6)గా గుర్తించారు. అయితే ఈ హత్యలు ఇప్పుడు బెంగాల్ లో రాజకీయ రంగు పులుముకున్నాయి. రాష్ట్రంలో లా అంట్ ఆర్డర్ పరిస్థితి దారుణంగా ఉందంటూ తృనముల్ కాంగ్రెస్ పై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.

మంగళవారం ఉదయం 11గంటలకు ప్రకాష్ లాల్ స్థానిక మార్కెట్  నుంచి వెళ్తున్న సమయంలో చివరిసారిగా అతడిని చూసినట్లు స్థానికులు తెలిపారు. ప్రకాష్ చివరిసారిగా కన్పించిన గంటలోపే కుటుంతో సహా హత్యకు గురైనట్లు కేసుని దర్యాప్తు చేస్తున్న అధికారి తెలిపారు. కనైగంజ్ లోని తమ నివాసంలోని అందరి మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. ప్రకాష్ లాల్,అతడి కొడుకు మృతదేహాన్ని ఒక రూమ్ లో,భార్య మృతదేహాన్ని మరో చోట గుర్తించినట్లు తెలిపారు.

మా కుటుంబ సభ్యుల్లో ఒకరు ప్రకాష్, అతని కొడుకుతో చివరిసారిగా మంగళవారం ఉదయం 11:15 గంటలకు ఫోన్‌లో మాట్లాడారు. కొన్ని సెకన్ల పాటు మాట్లాడిన తరువాత, అతను డిస్కనెక్ట్ అయ్యాడు. ప్రకాష్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు గది లోపల కిల్లర్స్ ఉన్నారని మేము భావిస్తున్నాము అని మృతుడి మామ రాజేష్ ఘోష్ అన్నారు. ఈ కేసుని వివిధ కోణాల్లో పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 

West Bengal
Murshidabad
death
murder
RSS WORKER
PREGNENT
Child
BJP
TMC

మరిన్ని వార్తలు