టెర్రరిస్టు నెల జీతం రూ.1లక్ష, ఫ్రెషర్‌కు రూ.25వేలు

Submitted on 22 October 2019
Rs 1 crore to Fidayeen. Exclusive details of what Pakistan pays to its terror recruits

ఐఎస్ఐ సహకారంతో పాకిస్తాన్ ఆర్మీ 16వేల మంది జిహాదిస్టులను నియమించిందట. ఇండియా టీవీ అనే ఇంగ్లీష్ మీడియా ఈ కథనం ప్రచురించింది. ఆర్టికల్ 370రద్దు తర్వాత కశ్మీర్ లో ఉన్న నిరుద్యోగులను భారీ వేతనాలు ఆశ చూపించి ఉద్యోగాల్లోకి తీసుకుందట. ఈ టెర్రరిస్టులకు ఇచ్చే నెలసరి వేతనం గురించి వింటే ఆశ్చర్యపోతారు. 

ఫ్రెషర్‌కు నెలకు రూ.25వేలు ఇస్తుండగా నైపుణ్యాన్ని బట్టి రూ.80వేలు ఇచ్చేందుకు కూడా వెనుకాడడం లేదు. సీనియారిటీ ఎక్కువ ఉంటే రూ.లక్ష వరకూ ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల వారు చెప్పిన మాటకు కట్టుబడి ఉంటారని వారినే ఎంచుకున్నారు. కొత్తగా తీసుకునే వాళ్లుకు పాతికవేలు రూపాయలు ఇచ్చి ఒకసారి ర్యాంకు పెరిగితే దానిని బట్టి వేతనం పెంచుతారు. 

పాకిస్తాన్ ఆర్థికంగా పతనమైన కారణంగా వారికి భారత్ పై దాడి చేసేంత ఆర్థిక స్తోమత లేదు. ఇలాంటి దాడులు చేసి తమను తాము కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. డ్రగ్ మార్కెట్ వల్ల సొమ్ము చేసుకుంటున్న పాక్.. పాకిస్తాన్-అఫ్ఘనిస్తాన్ బోర్డర్లో, యూరప్ లో ఉండే వారికి డ్రగ్స్ సరఫరా చేస్తూ ఆర్థికంగా సొమ్ము చేసుకుంటుంది. 

Fidayeen. Pakistan
terror recruits
terrorists

మరిన్ని వార్తలు