RRvsDC: పంత్ పటాకా.. ఢిల్లీ గెలిచింది

Submitted on 22 April 2019
RRvsDC: delhi won by 6 wickets

సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ విజృంభించింది. రాజస్థాన్ రాయల్స్‌ను ఇంకా 4 బంతులు మిగిలి ఉండగానే 6వికెట్ల తేడాతో ఓడించింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ వీర బాదుడుతో టార్గెట్ చేధించడంలో కీలక పాత్ర పోషించాడు.  192పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ఆది నుంచి మెరుపులు కురిపించారు. రాజస్థాన్ బౌలర్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఢిల్లీని కట్టడి చేయలేకపోయారు. 

ఓపెనర్లు పృథ్వీ షా(42; 39 బంతుల్లో 4ఫోర్లు, 1సిక్సు), శిఖర్ ధావన(54; 27 బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సులు)లకు రిషబ్ పంత్(78; 36బంతుల్లో 6ఫోర్లు, 4సిక్సులు)తోడై రాజస్థాన్  పతనాన్ని శాసించారు. మిగిలిన బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్(4), రూథర్‌ఫర్డ్(11), కొలిన్ ఇన్‌గ్రామ్(3)పరుగులతో సరిపెట్టుకున్నారు. 

రాజస్థాన్ బౌలర్లు ధావల్ కుల్కర్ణి, రియాన్ పరాగ్ చెరో వికెట్ తీయగా, శ్రేయాస్ గోపాల్ 2వికెట్లు పడగొట్టాడు. 

రాజస్థాన్ ఇన్నింగ్స్:

అంతకంటే ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ బ్యాటింగ్‌లో అదరగొట్టింది. అజింకా రహానె సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లకు 6వికెట్లు నష్టపోయి 191 పరుగులు చేయగలిగింది. కెప్టెన్సీ నుంచి తప్పించిన రెండో మ్యాచ్‌లో (105; 63బంతుల్లో 11ఫోర్లు, 3సిక్సులు)తో చెలరేగి జట్టుకు చక్కటి స్కోరు అందించాడు. మరో ఓపెనర్ సంజూ శాంసన్(0)డకౌట్ అయినప్పటికీ కెప్టెన్ స్టీవ్ స్మిత్(50; 32బంతుల్లో 8ఫోర్లు)కు మంచి భాగస్వామ్యం అందించాడు. 

మిగిలిన బ్యాట్స్‌మెన్ బెన్ స్టోక్స్(8), ఆష్టన్ టర్నర్(0), స్టువర్ట్ బిన్నీ(19), రియాన్ పరాగ్(4)లతో సరిపెట్టుకున్నారు. ఇషాంత్ శర్మ, అక్సర్ పటేల్, క్రిస్ మోరిస్ తలో వికెట్ తీయగా, రబాడ 2వికెట్లు పడగొట్టాడు. 

IPL 2019
IPL 12
rajasthan royals
delhi capitals
rr
dc

మరిన్ని వార్తలు