‘14’ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ - లవర్స్ షాక్!

Submitted on 14 February 2020
Romantic Thriller 14 Movie First Look Motion Poster Launched

రాయల్ పిక్చర్స్ బ్యానర్‌పై ర్యాప్ సింగర్, యువ నటుడు నోయెల్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న‌ రొమాంటిక్ థ్రిల్లర్.. ‘14’.. లక్ష్మీ శ్రీనివాస్ ద‌ర్శకత్వంలో సుబ్బారావ్ రాయన, శివకృష్ణ నిచ్చెన మెట్ల ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వైవిద్యభరితమైన ఈ చిత్రంలో రతన్, విశాఖ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ ఆచార్య, మహేష్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 14 వేలెంటైన్స్ డే కానుకగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ని బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా.. రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ : “ఈ మోషన్ పోస్టర్ చాలా కొత్తగా ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంది. ఈ పోస్టర్‌లాగే సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది అనుకుంటున్నాను. నోయల్‌కి ‘కుమారి 21ఎఫ్’ సినిమాకన్నా ఎక్కువ పేరు రావాలని ఆశిస్తున్నాను. టీమ్ అంద‌రికీ నా బెస్ట్ విషెస్‌’’ అన్నారు.

దర్శకుడు లక్ష్మిశ్రీనివాస్ మాట్లాడుతూ : “కొత్త పాయింట్‌ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని నమ్మకంతో మీ ముందుకు వస్తున్నాం. త‌ప్ప‌కుండా మా చిత్రం మంచి విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది’’ అన్నారు.


నోయెల్ సీన్, రతన్, వైశాఖ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ ఆచార్య, మహేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సాయినాథ్, సంగీతం : ఎర్త్ సౌండ్స్, ఎడిటర్ : జానకిరామ, స్టంట్స్ : డ్రాగన్ ప్రకాష్, మాటలు : ఆదిత్య భార్గవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కామిరెడ్డి బాబురెడ్డి, నిర్మాతలు : సుబ్బారావ్ రాయన, శివకృష్ణ నిచ్చెన మెట్ల, రచన- దర్శకత్వం : లక్ష్మిశ్రీనివాస్.

14 Movie First Look Motion Poster

Read Here>>గ్రేట్ న్యూస్ : కోవిడ్ - 19 (కరోనా) వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టిన కాలిఫోర్నియా!

14 Movie
first look
Motion Poster
Noel Sean
Rathan
vishaka
RoyalPictures
Lakshmi Srinivas

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు