కీలక పాత్ర కోసం : 14 గంటలు కుర్చీలోనే

Submitted on 18 January 2019
For This Role Madhavan Sit 14 Hours In Chair

కథానాయకుడిగా నటిస్తూనే, ప్రతినాయక పాత్రల్లోనూ నటించి మెప్పిస్తున్న మాధవన్‌. ఇప్పుడు వెండితెరపై విభిన్న పాత్రలను పోషించాలని తాపత్రయ పడే నటుల్లో ఒకరిగా నిలిచారు. ప్రముఖ శాస్త్రవేత్త అనంత నారాయణ్‌ మహదేవన్‌ జీవిత కథ ఆధారంగా టైటిల్‌ రోల్‌ పోషిస్తూ, ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్‌’. ‘నంబి సర్‌ ఒరిజినల్‌ పాత్రలో నటించేందుకు చాలా ఆత్రుతగా ఉన్నా. ఆయన వయస్సు మరో 15 సంవత్సరాలు తగ్గింది. అయితే ఆ లుక్‌లో నేను ఎలా ఉంటానో తెలియదు. నా నిజ జీవితానికి మాత్రం దూరంగా ఉంటా అని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో భాగంగా మాధవన్‌ తీవ్రంగా కష్టపడుతున్నారు. అనంత నారాయణ్‌లా కనపడేందుకు హెయిర్‌స్టైల్‌, గడ్డం పెంచుతున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలను మాధవన్‌ ఇటీవలే పంచుకున్నారు. ఇప్పుడు నారాయణ్‌ పాత్ర కోసం సిద్ధమవుతున్న మరో వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ల పోస్ట్‌ చేశారు. ‘ఆ పాత్రలో నటించేందుకు రెండేళ్లు పడితే, ఆ పాత్ర కోసం సిద్ధమవడానికి 14గంటలు కుర్చీలో కూర్చోవాల్సి వచ్చింది’’ అని పోస్ట్‌ చేశారు.

 

Rocketry: The Nambi Effect
Madhavan
14 Hours In Chair

మరిన్ని వార్తలు