ఆయుధపూజ చేశాడు - నెటిజన్లు ఆడుకుంటున్నారు!

Submitted on 9 October 2019
Rishi Kapoor's ‘Shastra Pooja’ on Dussehra

సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మీమ్స్, ట్రోలింగ్‌ల పేరుతో తాట తీసేస్తారు నెటిజన్స్. బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ మరోసారి నెటిజన్స్‌కి కోపం తెప్పించారు. క్యాన్సర్ ట్రీట్‌మెంట్ కోసం 11 నెలల పాటు అమెరికాలో ఉన్న రిషి కపూర్.. ఇటీవలే ముంబై వచ్చారు. దసరా సందర్భంగా ఆయన చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది.

దసరా హిందువులకు పవిత్రమైన పండుగ.. దసరా సందర్భంగా వాహనాలకు, ఇంట్లోని ముఖ్యమైన వస్తువులకు ఆయుధపూజలు చేస్తుంటారు. ఇంతకీ రిషి కపూర్ ఏం చేశారయ్యా అంటే.. అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.. ఇక్కడి వరకూ బాగానే ఉంది.. ‘ఫెస్టివ్ సీజన్ బిగిన్స్.. శాస్త్ర పూజ’ అంటూ ఓపెనర్‌కి పసుపు కుంకుమ రాసి ఉన్న పిక్ పోస్ట్ చేసి, ‘దీన్ని బాధ్యతగా వాడాలి’ అంటూ సలహా ఇచ్చారు.. ఇక చూసుకోండి.. నెటిజన్స్ ఓ రేంజ్‌లో తగులుకున్నారు..  

Read Also : భూల్ భూలైయా 2 - ప్రారంభం..

సీనియర్ నటుడిగా బాధ్యతగా వ్యవహరించాల్సిన మీరు పండుగ నాడు ఇలాంటి పోస్టులు చెయ్యడమేంటి?.. ఆయుధానికీ, పరికరానికీ తేడా తెలియదా?.. అంటూ రిషి కపూర్‌ని ప్రశ్నిస్తున్నారు. ఏదో ఒక కాంట్రవర్షియల్ పోస్ట్ లేదా కామెంట్ చెయ్యడం.. ఎవరు ఏమన్నా కేర్ చెయ్యకపోవడం ఆయన స్టైల్ కాబట్టి.. ఎలాంటి రియాక్షన్ ఇవ్వడం కానీ, పోస్ట్ డిలీట్ చెయ్యడం కానీ చెయ్యలేదు.. ఈ ‘ఆయుధపూజ’ పోస్ట్ వివాదం ఎంత వరకు వెళ్తుందో చూడాలి.. 

Rishi Kapoor
‘Shastra Pooja’ on Dussehra
Netizens Fire

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు