క్యాన్సర్ ను జయించి : ముంబైకి చేరుకున్న రిషీ కపూర్

Submitted on 10 September 2019
Rishi Kapoor Returns Cancer Treatment

క్యాన్సర్ ను జయించి ముంబైలో కాలుమోపాడు బాలీవుడ్ నటుడు రిషీ కపూర్. కొంతకాలంగా ఆయన న్యూయార్క్ లో ఈ వ్యాధికి చికిత్స తీసుకున్నారు. సెప్టెంబర్ 10వ తేదీ మంగళవారం సతీమణి నీతూ కపూర్ తో కలిసి ముంబైకి చేరుకున్నారు. ఆయనకు ఫ్యామిటీ సభ్యులు, ఇతరులు స్వాగతం పలికారు. అందరికీ అభివాదం చేసిన ఆయన..నేరుగా నివాసానికి వెళ్లిపోయారు. క్యాన్సర్ కారణంగా ఆయన కొంత చిక్కిపోయినట్లుగా కనిపిస్తున్నారు. చికత్సలో భాగంగా ఆయన నిమిత్తంగా ఆహారం తీసుకున్నట్లు తెలుస్తోంది. చికిత్స వల్ల ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు చెప్పారు రిషీ. 

ఏడాది క్రితం చెకప్ నిమిత్తం అమెరికాకు వెళుతున్నట్లు రిషీ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. దీంతో ఆయన ఆరోగ్యంపై వదంతులు వ్యాపించాయి. త్వరలో తిరిగి వస్తాయని, పుకార్లు వ్యాపింప చేయవద్దని..తప్పుడు వార్తలు సృష్టించొద్దని ఆయన సూచించారు. న్యూయార్క్ లోని ఓ ఆస్పత్రిలో చేరిన రిషికి క్యాన్సర్ ఉందని వైద్యులు నిర్ధారించారు. అప్పటి నుంచి చికిత్స అందించారు. ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తోంది.

న్యూయార్క్ కు వెళ్లిన పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు రిషిని పరామర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలను నీతూ సోషల్ మీడియాలో పోస్టు చేసేవారు. సెప్టెంబర్ 04వ తేదీన ఆయన జన్మదినం జరుపుకున్నారు. ట్రీట్ మెంట్ లో భాగంగా నాలుగు నెలల పాటు పస్తులున్న అతను..26 కేజీల బరువు తగ్గారంట. ఆగస్టు నాటికి పూర్తిస్థాయిలో కోలుకుని ముంబైకి వస్తానని ఇటీవలే రిషీ వెల్లడించారు. వ్యాధి నుంచి కోలుకున్న రిషి..సినిమా నటిస్తారా ? లేదా ? అనేది తెలియరాలేదు. విశ్రాంతి తీసుకొంటారని తెలుస్తోంది. ఆయన చివరగా ఝూటా కహీ కా అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. 
 

Rishi Kapoor
returns
Cancer Treatment

మరిన్ని వార్తలు