ప్రేమలో పడ్డ రిషభ్ పంత్:ఇషానేగి ఫోటోలు పోస్ట్ చేసిన వికెట్ కీపర్ 

Submitted on 17 January 2019
Ishanegi Rishabhoant

టీమిండియా వికెట్  కీపర్ రిషభ్ పంత్ ప్రేమలో పడ్డాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్ట్ క్రికెట్లో తన ప్రతిభ కనపరిచిన రిషభ్ ఇన్ స్టాగ్రాంలో  పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
యంగ్ ఎంటర్ ప్రెన్యూర్, ఇంటీరియర్ డిజైనర్  ఇషానేగితో సన్నిహితంగా ఉన్న ఫోటోను ఇన్ స్టాగ్రాం లో పోస్ట్ చేస్తూ  రిషభ్ " నా సంతోషానికి కారణం నువ్వే, నిన్ను సంతోషంగా ఉంచాలనుకుంటున్నాను." అని కామెంట్  చేశాడు. ఇదే ఫోటోను పోస్టు చేసిన ఇషానేగి  "మై బెస్ట్ ఫ్రెండ్, మై సోల్ మేట్, మై లవ్, మై లైఫ్ " అంటూ క్యాప్షన్  రాసింది. ఇలాంటి ఫోటోతో రిషబ్ పంత్ తన గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేయటం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగామారింది.

ishanegi
rishabpant
Indian Crickter
Team India
Love

మరిన్ని వార్తలు