అసలు కథేంటి: లండన్‌లో అడుగుపెట్టిన రిషబ్ పంత్

Submitted on 15 June 2019
Rishabh Pant arrives in Manchester

భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు రిషబ్ పంత్ ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టాడు. శిఖర్ ధావన్ గాయంతో 3వారాల పాటు టోర్నీకి దూరమవడంతో ఎక్స్ ట్రా ప్లేయర్‌గా జాబితాలో స్థానం దక్కించుకున్న పంత్‌కు పిలుపొచ్చింది. ఈ మేర ఇంగ్లాండ్‌కు వచ్చిన పంత్‌ ఫొటోను పోస్టు చేస్తూ బీసీసీఐ అధికారిక ట్విట్టర్ ద్వారాపంచుకుంది. చూడండి ఇక్కడెవరున్నారో.. అంటూ పంత్ ఫొటో ఉంచి పోస్టు చేసింది.

పంత్‌ను ఇంగ్లాండ్‌లోనే అట్టిపెట్టుకుని ధావన్ కోలుకుంటాడని టీమిండియా మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. అనుకున్నరీతిలో ఓపెనర్ గా కేఎల్ రాహుల్ రాణించలేకపోతే.. ధావన్ కోలుకోని పక్షంలో పంత్ ను రంగంలోకి దింపనున్నట్లు సమాచారం. 

ఇక్కడ పంత్.. రావడం కంటే విశేషమేమిటంటే.. కరాచీ నుంచి వచ్చిన క్రికెట్ అభిమాని మొహమ్మద్ బషీర్ (చాచా చికాగో). మహేంద్ర సింగ్ ధోనీతో అతనికి ప్రత్యేక అభిమానం ఉంది. ఎనిమిదేళ్లుగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఈ అభిమానికి టిక్కెట్ వేయించి మరీ పిలుస్తాడు ధోనీ. సొంతగడ్డతో తలపడుతోన్న భారత్‌తో అతనికున్న సంబంధం.. బషీర్ భార్య హైదరాబాదీ కావడం ఒక విశేషం. 

భారత పాక్ మ్యాచ్ చూడటానికి వెళ్లే అభిమాని బషీర్ ఒక్కడే కాదు. వేల కొద్దీ అభిమానులు దేశ విదేశాల నుంచి మ్యాచ్ చూసేందుకు మాంచెస్టర్‌కు చేరుకుంటున్నారు. భారీ అంచనాల మధ్య మ్యాచ్ వీక్షించేందుకు వస్తున్న క్రికెట్ అభిమానుల మధ్య ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు దాయాదుల మధ్య మ్యాచ్ జరగనుంది. 

rishabh pant
Manchester
england
india
Pakistan
ind
Pak
cricket
2019 icc world cup
world cup 2019

మరిన్ని వార్తలు