కితకితలు: గోపికా కృష్ణులుగా శ్రీదేవి.. రామ్ గోపాల్ వర్మ

Submitted on 24 August 2019
 RGV As Krishna.. Sridevi As Gopika

టాలీవుడ్ విలక్షణ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అంటేనే ఓ సెన్సేషన్. ఆయన ఏది చేసినా పెద్ద దుమారమే. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటాడు. అయితే కృష్ణాష్టమి సందర్భంగా వర్మ అందరికి ఏ విధంగా శుభాకాంక్షలు తెలిపారో చూశారా?

వర్మని శ్రీకృష్ణుడిగా చూపించుకుంటూ తనకి బాగా ఇష్టమైన నటి శ్రీదేవీని గోపికగా మార్చి ఓ వీడియోను క్రియేట్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్ బుక్ లో అప్‌లోడ్‌ చేశారు. అయితే ఈ వీడియోలో శ్రీదేవి.. రామ్ గోపాల్ వర్మ మాట్లాడుకుంటుండగా.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజీక్ గా 'జాము రాతిరీ జాబిలమ్మా' సాంగ్ వస్తుంది. 

ఈ వీడియోలో శ్రీదేవి 'మానవా.. నిన్నే మానవా' అని పిలుస్తుండగా.. వర్మ 'ఆ ఉన్నానండి ఇక్కడే ఉన్నా' అని అంటాడు. ఇలా ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకుంటారు. ఆ మాటలు వింటే పొట్టపగిలేలా నవ్వుకుంటారు. అంతేకాదు వీడియో చివర్లో శ్రీదేవి 'మానవా.. ఐ లైక్‌ యూ' అని చెబుతోంది... వర్మ వెంటనే సూపర్బ్ థ్యాంక్స్‌ అండీ.. థాంక్యూ వెరీ మచ్ అని చెప్పడం హైలైట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Who did this? ?

A post shared by RGV (@rgvzoomin) on

RGV As Krishna
Sridevi As Gopika
Krishnastami

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు