అయోధ్య తీర్పు: సోషల్ మీడియాపై పోలీసుల కన్ను.. హద్దులు దాటి పోస్టింగులు పెట్టొద్దు

Submitted on 9 November 2019
Restrictions on social media Supreme Court verdict on Ayodhya

వివాదాస్పద అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించబోతోంది. 2019, నవంబర్ 09వ తేదీ శనివారం ఉదయం 10.30గంటలకు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 2019, నవంబర్ 09వ తేదీ శనివారం ఉదయం 10.30గంటలకు తీర్పును వెలువరించనుంది. దీంతో దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రధానంగా ప్రభావితం చేసే సోషల్ మీడియాపై కన్ను వేసింది కేంద్రం. 

దేశంలో ఎవరైనా హద్దు మీరి పోస్టింగ్‌లు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. శాంతిభద్రతల కాపాడడం కోసం సమాచార వ్యవస్థపై ఈ కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రెచ్చగొట్టే సందేశాలు పంపినా..వీడియోలు షేర్ చేసినా వారిపై ఉక్కుపాదం మోపనున్నారు. భావవిరుద్ధమైన ప్రకటనలు నేరపూరితంగా పరిగణించబడుతాయని, ప్రజలు అర్థం చేసుకోవాలని కేంద్రం సూచించింది. తప్పుడు సందేశాలు పంపకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. 

> వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌తో పాటు అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ పరిశీలన చేయనున్నారు.
> శాంతిభద్రతల దృష్ట్యా కాల్ రికార్డింగ్స్ చేయబడుతాయి.
> ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నీ హోం మంత్రిత్వ శాఖ వ్యవస్థలకు అనుసంధానం చేశారు. 
> అభ్యంతకరమైన పోస్టులు, వీడియోలు పంపించడానికి వీలు లేదు. 
> అయోధ్య తీర్పుపై వచ్చే సందేశాలను మరొకరికి పంపడంపై ఆంక్షలు విధించారు. 
> తీర్పుపై వచ్చే సందేశాలను డిలీట్ చేయాలని శాంతిభద్రతల అదనపు డీజీ జితేందర్ ప్రకటించారు. 
> ఎవరైనా వాటిని మరొకరికి కానీ..మరో గ్రూప్‌నకు పంపిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. 
> గ్యాంగ్ స్టర్ యాక్టు, జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా మేజిస్ట్రేట్ వీఎన్ సింగ్ అధికారిక ప్రకటనలో స్పష్టం చేశారు.
మొత్తానికి సామాజిక మాధ్యమాలపై పోలీసు అధికారులు డేగ కన్ను పెట్టారు. 
 

Read More : అయోధ్య తీర్పు : హైదరాబాద్‌లో బలగాల మోహరింపు

Restrictions on social media Supreme Court verdict on Ayodhya

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు