JIO రేట్లు మారాయ్: All In One ప్యాక్స్ ఇవే

Submitted on 21 October 2019
Reliance Jio’s new All-in-One plans launched: Price, features, and other details

ఐయూసీ ఛార్జీలంటూ నిమిషానికి 6పైసలు వసూలు చేస్తామని చెప్పిన జియో.. ఈ స్కీమ్ మొదలైనప్పటి నుంచీ రీఛార్జ్ రేట్లతోనే కలిపి అదనపు అమౌంట్ వసూలు చేస్తోంది. వీటికి కొత్తగా లాంచ్ చేసినట్లు చూపెడుతూ మార్కెట్లోకి ఆల్ ఇన్ వన్ ప్యాక్స్ మొదలుపెట్టాయి. 

ఈ ప్యాక్ ల ప్రారంభధరే రూ.222గా ఉంది. గతంలో రూ.149కు 1.5జీబీ డేటాను మాత్రమే ఇచ్చే ఈ కొత్త ప్యాక్ తో 2జీబీ డేటా ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఆ ప్యాక్ ల వివరాలు ఇలా ఉన్నాయి. నెలకు రూ.222తో చేసే ప్లాన్‌తో రోజుకు 2జీబీ డేటా, జియో టు జియోకు అన్ లిమిటెడ్ అవుట్ గోయింగ్ కాలింగ్స్, ఇతర నెట్‌వర్క్‌లకు వెయ్యి నిమిషాల టాక్ టైం. అలాగే రూ.333తో రీఛార్జ్ చేయిస్తే ఇదే ఆఫర్లు 2నెలల వ్యాలిడిటీ ఉంటాయి. 

ఇలా రూ.111పెంచుకుంటూ పోయినకొలదీ ఒక్కో నెల వ్యాలిడిటీ పెరుగుతూ ఉంటుంది. గతంలో 1.5జీబీ ప్యాక్ డేటాతో ఉన్న యూజర్లకు ఇదే ఆఫర్లతో కొత్త ప్యాక్ కావాలంటే అదనంగా రూ.80తో రీఛార్జ్ చేయించుకుంటే సరిపోతుంది. 

reliance jio
All-in-One
LAUNCHED
Reliance

మరిన్ని వార్తలు