హోలీ ఎక్సేంజ్ ఆఫర్ : జియోఫోన్ యూజర్లకు మాత్రమే

Submitted on 21 March 2019
Reliance Jio Offers JioPhone cut price with Holi Exchange Scheme

ప్రముఖ మొబైల్ నెట్ వర్క్ దిగ్గజం రిలయన్స్ జియో హోలీ పండుగ సందర్భంగా తమ యూజర్లకు స్పెషల్ ఎక్సేంజ్ ఆఫర్ అందిస్తోంది. ‘హ్యాపీ హోలీ’స్కీమ్ కింద జియో యూజర్లు.. 4జీ జియో ఫోన్ కొత్త డివైజ్ ను సొంతం చేసుకోవచ్చు.
Read Also : వింతల్లోనే వింత : అప్పుడే పుట్టిన చిన్నారి కడుపులో.. మరో బేబీ

ఎక్సేంజ్ ఆఫర్ కింద తమ పాత ఫోన్ (వర్కింగ్ ఫోన్) ఇచ్చి కొత్త జియోఫోన్ తక్కువ ధరకే పొందొచ్చు. జియోఫోన్ మార్కెట్ ధర రూ.1,500 ఉండగా.. ఎక్సేంజ్ ఆఫర్ పై రూ.1,095 లకే సొంతం చేసుకోవచ్చు. జియో కొత్త ఫోన్ కొన్నప్పటికీ.. మీ ఫోన్ నెంబర్ మార్చుకోవాల్సిన పనిలేదు. ప్రస్తుతం వాడుతున్న ఫోన్ నెంబర్ తోనే కొత్త జియో ఫోన్ సొంతం చేసుకోవచ్చు.  

హోలీ సందర్భంగా రిలయన్స్ జియో స్పెషల్ ఎక్సేంజ్ ఆఫర్ కు సంబంధించి వివరాలను రిలయన్స్ జియో వెబ్ సైట్ jio.comలో అప్ డేట్ చేసింది. ఈ స్కీమ్ కింద జియో ఫోన్ కొన్న కస్టమర్లకు ఫ్రీ వాయిస్ కాల్స్, 84GB హైస్పీడ్ డేటా కూడా పొందొచ్చు.

అంతేకాదు.. 168 రోజుల్లో (28*6) రోజుకు 0.5జీబీ డేటా పొందొచ్చు. డేటా లిమిట్ దాటగానే.. స్పీడ్ 64కేబీపీఎస్ కు పడిపోతుంది. జియో ఎక్సేంజ్ ఆఫర్ కింద కస్టమర్లు దాదాపు 90జీబీ వరకు హైస్పీడ్ డేటా పొందొచ్చు. Exchange ఆఫర్ కోసం jio.com   విజిట్ చేయండి.. కొత్త జియో ఫోన్ సొంతం చేసుకోండి.
Reliance Jio, JioPhone, Holi Exchange Scheme

జియో అందించే 3 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ మీకోసం..

రూ.49 రీఛార్జ్ ప్లాన్స్ : (నెలవారీ ప్యాక్)
ఈ ప్లాన్ పై రూ.49తో రీఛార్జ్ చేసుకుంటే.. అన్ లిమిటెడ్ కాలింగ్స్ పొందవచ్చు. 1జీబీ హైస్పీడ్ డేటా, 50 ఎస్ఎంఎస్ లు 28రోజుల కాలపరిమితిపై పొందొచ్చు. ఇందులో 1జీబీ డేటా లిమిట్ దాటితే.. 64కేబీపీఎస్ స్పీడ్ కు తగ్గిపోతుంది. ఈ ప్లాన్ 28రోజుల వరకు వర్తిస్తుంది. 

రూ. 99 రీఛార్జ్ ప్లాన్ (నెలవారీ ప్యాక్)
ఈ ప్లాన్ పై కూడా రిలయన్స్ జియో అన్ లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ అందిస్తోంది. 14జీబీ హైస్పీడ్ డేటా, 300 ఎస్ఎంఎస్ లు పొందొచ్చు. రోజువారీ డేటా వాడకం 0.5జీబీ వరకు పొందొచ్చు. ఈ లిమిట్ దాటితే మాత్రం డేటా స్పీడ్ 64కేబీపీఎస్ కు తగ్గిపోతుంది. ప్లాన్ కాలపరిమితి 28 రోజుల వరకు వర్తిస్తుంది. 

రూ. 594 రీఛార్జ్ ప్లాన్ (లాంగ్ టెర్మ్ ప్లాన్)
ఈ ప్లాన్ ప్రకారం.. రిలయన్స్ జియో అన్ లిమిటెడ్ కాలింగ్, 84జీబీ హైస్పీడ్ డేటా, 300 ఎస్ఎంఎస్ లు అందిస్తోంది. డెయిలీ హైస్పీడ్ డేటా 0.5జీబీ వరకు పొందొచ్చు. ఈ లిమిట్ దాటితే.. డేటా స్పీడ్ 64కేబీపీఎస్ కు తగ్గిపోతుంది. ఈ ప్లాన్ కాల పరిమితి 168 రోజులు వరకు ఉంటుంది. 
Read Also : వాట్సాప్‌లో హోలీ స్టిక్కర్లు : డౌన్ లోడ్ చేసుకోండిలా

reliance jio
JioPhone
Holi Exchange Scheme   

మరిన్ని వార్తలు