జియో ఆస్తులు అమ్ముతున్న అంబానీ

Submitted on 8 February 2019
Reliance Industries may sell Jio infra assets to reduce debt

అంబానీకే ఆర్థిక కష్టాలు వచ్చాయా.. కూతురి పెళ్లికే వందల కోట్లు ఖర్చు చేశారు.. ఇప్పుడు కొడుకు పెళ్లి కూడా కోట్ల ఖర్చుతో చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. దేశంలోనే అపర కుబేరుడు.. అలాంటి ముఖేశ్ అంబానీనే అప్పులు తీర్చటానికి ఆస్తులు అమ్ముతున్నారనే వార్త  వ్యాపార వర్గాల్లో సంచలనంగా మారింది. అప్పులను తగ్గించుకోవటం (Dept బ్యాలెన్స్ షీట్) కోసం అంబానీ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంబానీ విక్రయించనున్న ఆస్తులు ఏంటో తెలుసా.. జియోవి. రెండేళ్ల క్రితం ప్రారంభించిన జియో నెట్ వర్క్ పరిధిలోని.. టవర్స్, ఆప్టిక్ పైబర్ షేర్లపై భారీ అప్పులు అయ్యాయి. ఈ డెబ్ట్ ను క్లియర్ చేసేందుకు ఆయా ఆస్తులను విక్రయించాలని అంబానీ నిర్ణయించినట్లు జాతీయ పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.  


కెనడా కంపెనీతో బిగ్ డీల్:
ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) రిలయన్స్ టవర్లు, ఫైబర్ నెట్ వర్క్ ను రెండు సంస్థలుగా విడగొడుతున్నట్టు ప్రకటించింది. సంస్థపై పడిన రూ. 3 లక్షల కోట్లు (40 బిలియన్ డాలర్లు) అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు రిలయన్స్ జియో ఆస్తులపై కెనడా కంపెనీతో బిగ్ డీల్ కుదుర్చుకునే పనిలో పడింది. ఇప్పటికే రిలయన్స్ జియోకు రిలయన్స్ జియో టెలికం టవర్లు, ఫైబర్ అసెట్స్ మార్కెట్ విలువ 15 బిలియన్లు (రూ.1.07 లక్షల కోట్లు). ఈ విలువైన షేర్లు కొనేందుకు రెండెంటి మధ్య బిగ్ డీల్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. రిలయజన్స్ జియో నెట్ వర్క్ పై దేశవ్యాప్తంగా థర్డ్ పార్టీలతో కలిపి 2.2 లక్షల టవర్లు ఉన్నాయి. ఇందులో ఆప్టిక్ ఫైబర్లు 3 లక్షల రూట్ కిలోమీటర్ల వరకు విస్తరించగా.. 300 మిలియన్ల మంది వినియోగదారులకు Fast Network సర్వీసును అందిస్తోంది. 


బ్రూక్ ఫీల్డ్ దిగ్గజం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 330 బిలియన్లకు పైగా రన్ చేస్తోంది. ఆసియాలో మూడో అతిపెద్ద ఎకనామీ ఇండస్ట్రీగా పేరొందిన బ్రూక్ ఫీల్డ్.. టెలికం ఇన్ ఫ్రాస్ర్టక్చర్లపై దృష్టిపెట్టింది. ఇప్పడు ఇండియాలో జియో టెలికం ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పై కన్నేసింది. జియోతో డీల్ కుదిరితే భవిష్యుత్తులో 50 శాతం మార్కెట్ షేర్ ను పెంచుకోవడమే లక్ష్యంగా కెనడా కంపెనీ భావిస్తోంది. కెనడా ఆధారిత కంపెనీ బ్రూక్ ఫీల్డ్ అసెట్ మేనేజ్ మెంట్.. ప్రపంచంలోనే టాప్ ఇన్ ఫ్రాస్ట్రక్షర్, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ కంపెనీల్లో ఒకటి. జియోతో ఈ బిగ్ డీల్ కుదిరితే భారత్ లో అతిపెద్ద M&A డీల్ లో అగ్రగామిగా బ్రూక్ ఫీల్డ్ కంపెనీ నిలవనుంది. జియోతో డీల్ పై కెనడా అతిపెద్ద టెలికం ఇన్ ఫ్రా స్ట్రక్చర్ బ్రూక్ ఫీల్డ్ నుంచి ఎలాంటి స్పందనలేదు. జియో రిలయన్స్ కూడా స్పందించలేదు. 


గత ఏడాదిలో నష్టాల్లో ఉన్న ముఖేశ్ అంబానీ, ఫ్యామిలీ 2 బిలియన్ డాలర్ల ఆస్తులను ఈ కెనడా కంపెనీ కొనేసింది. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ నుంచి గుజరాత్ లోని భరూచ్ కలుపుతూ వేసిన ఈస్ట్ వెస్ట్ పైపులైన్ 1,400 కిలోమీటర్లు పైపులైన్ షేర్లను కెనడా కంపెనీ కొనేసింది.   

Read Also:  ఫీచర్స్ సూపర్ అంట : జియో 3 ఫోన్ కమింగ్ సూన్

Read Also:  కండిషన్స్ అప్లై: వోడాఫోన్ కొత్త రీఛార్జ్ ప్లాన్

Read Also:  టాక్ టైమ్ ఈజ్ బ్యాక్ : వోడాఫోన్ 3 రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

Read Also:  ఓపిక పట్టండీ : 3 నెలల్లో భారీగా తగ్గనున్న DTH ఛానళ్ల ధరలు

Read Also:  ఎంపీకే షాక్ : సీఎం రమేష్ వాట్సాప్ బ్యాన్

Read Also:  వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక: మీ అకౌంట్ బ్లాక్ కాకూడదంటే..

Reliance
Industries
Jio Infra
Assets
reduce debt
RIL
Brooke Field
fibre assets

మరిన్ని వార్తలు