మే 28నే లాంచ్ : Redmi K20 వచ్చేస్తోంది 

Submitted on 24 May 2019
Redmi K20 to launch on May 28 in China as well as India, with 48MP primary camera 

చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ కంపెనీ రెడ్ మి ఫ్లాగ్ షిప్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. అదే.. Redmi K20 స్మార్ట్ ఫోన్.. ఈ కొత్త స్మార్ట్ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 855 ప్రాసిసర్ (SoC) స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలువనుంది. వన్ ప్లస్ 7 స్మార్ట్ ఫోన్ కు పోటీగా ఈ ఫ్లాగ్ షిప్ ప్రాసిసర్ ను షియోమీ నేరుగా రెడ్ మి కె20లో తీసుకోస్తోంది.

వన్ ప్లస్ 7, వన్ ప్లస్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ల ధర కంటే రెడ్ మి కె20 ధర తక్కువ ఉండే అవకాశం ఉంది. మే 28న చైనాలోని బీజింగ్ లో (11:30 గంటలకు) రెడ్ మి K20 ఫ్లాగ్ షిప్ ఫోన్ లాంచ్ చేయనున్నారు. అధికారిక టీజర్ రిలీజ్ ద్వారా విడుదల తేదీని కంపెనీ వెల్లడించింది. ఇండియా మార్కెట్లో కూడా Redmi K20 స్మార్ట్ ఫోన్ విడుదల చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. 

ఈ ఫోన్ లో ట్రిపుల్ కెమెరా సెటప్, స్పోర్ట్ 48మెగా ఫిక్సల్ సోనీ IMX586 ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉంటుందని అంచనా. పాప్ అప్ కెమెరా మెకానిజంతో వస్తోందని కంపెనీ కూడా రివీల్ చేసింది. ఇందులో సెల్ఫీల కోసం స్పోర్ట్ 32MP సెన్సార్ ఫీచర్ ఆకర్షించేలా ఉంది. చైనీస్ సోషల్ మీడియా వైబో లో టీజర్ వీడియోలో ఈ ఫీచర్ కనిపించింది. 960fps అడ్వాన్స్ స్లో మోషన్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది.

స్పెషిఫికేషన్ల విషయానికి వస్తే.. రెడ్ మి కె20 స్మార్ట్ ఫోన్ 6.39 అంగుళాల OLED డిస్ ప్లే తో 19:5:9 అస్పాక్ట్ రేషియో 1080పీ ప్లస్ రెజ్యులేషన్ తో వస్తోంది. షియోమీ కంపెనీ రెడ్ మి కె20 స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్లలో రిలీజ్ చేయనుంది.

అందులో ఒకటి రెడ్ మి కె20.. రెండోవది రెడ్ మి కె20 ప్రో వేరియంట్. రెడ్ మి కె20 ప్రో స్మార్ట్ ఫోన్ ను.. ఇండియాలో Poco F2 గా మార్కెట్లోకి రిలీజ్ కానుంది. గతంలో రిలీజైన Poco F1 తర్వాత షియోమీ ఇంతవరకూ మరో సిరీస్ ప్రకటించలేదు. 

ఫీచర్లు - స్పెషిఫికేషన్లు ఇవే : 
*
6.39 అంగుళాల OLED డిస్ ప్లే, 19:5:9 అస్పెక్ట్ రేషియో
* ఫ్లాగ్ షిప్ ప్రాసిసర్, స్పోర్ట్ స్నాప్ డ్రాగన్ 855 SoC
* స్ర్కీన్ రెజ్యులుషన్ 1080p+ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ 
స్పోర్ట్ 48MP సోనీ IMX586 ప్రైమరీ కెమెరా సెన్సార్
* పాప్ అప్ కెమెరా మెకానిజం
* 32MP సెన్సార్ (సెల్ఫీ కెమెరా)
* 960fbs స్టో మోషన్ వీడియో రికార్డింగ్ సపోర్ట్

Redmi K20
 48MP primary camera
XIAOMI
Redmi Series
Poco F2

మరిన్ని వార్తలు