మాట నిలబెట్టుకున్నారు : ఇద్దరికి వాహనాలు గిఫ్ట్ గా ఇచ్చిన మహీంద్రా

Submitted on 19 September 2019
Recognising 2 winners of the caption competition Anand Mahindra

ప్రముఖ వ్యాపార వేత్త, మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మాట నిలబెట్టుకున్నారు. తాను పోస్టు చేసిన ఫొటోకు మంచి క్యాప్షన్ పెట్టిన ఇద్దరికి మహీంద్రా వాహనాలను ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం ఓ బస్సు ఫొటోను ఆనంద్ షేర్ చేశారు. దానికి సరిగ్గా సరిపోయే క్యాప్షన్ పెట్టాలని, హిందీ, ఇంగ్లీష్ భాషలో ఉండాలని..మంచి క్యాప్షన్ పెట్టిన వారికి మహీంద్రా వాహనాన్ని గిఫ్ట్‌గా ఇస్తానని ప్రకటించారు.

ఎంతో మంది వీటికి కామెంట్స్ పెట్టి పోస్టు చేశారు. ఇందులో నుంచి రాకేష్, భూపేశ్ వ్యక్తులు పెట్టిన క్యాప్షన్ నచ్చిందని..వీరికి వాహనాలను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. క్యాప్షన్ పోటీలో ఇద్దరు గెలుపొందారు..కంగ్రాట్స్ అంటూ మహీంద్రా ట్వీట్ చేశారు. రెండు తెలివైన సమాధానాలు. మహీంద్రా కేర్స్ డీఎంకు అడ్రస్ పంపండి. భూపేశ్..చిరునామా షేర్ చేయండి’ అంటూ ట్వీట్ చేశారు. ఇంతకీ వారు ఏ క్యాప్షన్ పెట్టారో తెలుసా...రాకేష్ (సబ్ కీ బస్ SUB की BUS),  భూపేశ్ (హ్యాంగోవర్ బస్ Hangover Bus) ఇచ్చారు. 
 

Recognising
2 winners
caption
Competition
Anand Mahindra

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు