రెచ్చిపోదాం బ్రదర్- వీడియో సాంగ్

Submitted on 9 February 2019
Rechhipodham Brother Video Song from F2-10TV

విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా, మిల్కీబ్యూటీ తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబినేషన్‌లో వచ్చిన ఎఫ్2.. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి, అయిదవ వారంలోకి అడుగు పెట్టింది. సంక్రాంతి విన్నర్‌గా నిలవడమే కాకుండా, 2019 వ సంవత్సరానికి శుభారంభాన్నిచ్చింది ఎఫ్2. ఇప్పటికే రూ. 100 కోట్ల క్లబ్లో ఎంటర్ అయిపోయింది. రీసెంట్‌గా ఎఫ్2 లోని రెచ్చిపోదాం బ్రదర్.. వీడియో సాంగ్ రిలీజ్ చేసారు. ఈ పాటకి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా, కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాసాడు. డేవిడ్ సిమన్ అంతే బాగా పాడాడు.

ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఈ పాటలో వెంకీ, వరుణ్ చేసిన ఎంజాయ్ మామూలుగా ఉండదసలు. వీళ్ళకి నటకిరిటి రాజేంద్ర ప్రసాద్ యాడ్ అయ్యే సరికి జోష్ త్రిబుల్ అవుతుంది.
ఈ ఫిబ్రవరి 11 నుండి అమెజాన్‌లో ఎఫ్2 మూవీ చూడొచ్చు. జనవరి 12న ఎఫ్2 రిలీజ్ అయ్యింది. ఫిబ్రవరి 11 నాటికి కరెక్ట్‌గా 30 రోజులు పూర్తి చేసుకుంటుంది. థియేట్రికల్ రన్ కంప్లీట్ అవ్వకుండానే ఎఫ్2, అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుండడం విశేషమే.

వాచ్ రెచ్చిపోదాం బ్రదర్ వీడియో సాంగ్...

Venkatesh
Varun Tej
Tamannaah
Mehrene
Dil Raju
Anil Ravipudi

మరిన్ని వార్తలు