దేశ రాజకీయాల ప్రభావంతోనే సికింద్రాబాద్‌లో ఓడాం - తలసాని

Submitted on 24 May 2019
Reasons For Talasani Sai Kiran Yadav Losing

దేశ రాజకీయాల ప్రభావంతో సికింద్రాబాద్ నియోజకవర్గంలో TRS ఓడిపోయిందన్నారు మంత్రి తలసాని. BJP అభ్యర్థి కిషన్ రెడ్డి చేతిలో TRS అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్ పరాజయం చెందిన సంగతి తెలిసిందే. కిషన్ రెడ్డికి 3 లక్షల 84 వేల 248 ఓట్లు వస్తే..తలసాని సాయి కిరణ్‌కు 3 లక్షల 22 వేల 482 ఓట్లు వచ్చాయన్నారు. మే 24వ తేదీన తలసాని మీడియాతో మాట్లాడారు. ఓటమికి గల కారణాలు చెప్పారు. ఓటమి చెందినా..ప్రజాక్షేత్రంలో కష్టపడి పనిచేస్తామన్నారు.

ఓటమి..గెలుపు అనేది చూడమన్నారు. సాయి కిరణ్‌ గెలుపు కోసం పనిచేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేసేందుకు పలు ప్రాంతాల్లో పర్యటిస్తామని చెప్పారు. మే 25వ తేదీ శనివారం ఉదయం 10.30 గంటలకు అంబర్ పేట, 11 గంటలకు ముషిరాబాద్ తర్వాత సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో పర్యటిస్తామన్నారు. మే 26వ తేదీన ఉదయం 09 గంటలకు సనత్ నగర్, ఉదయం 10 గంటలకు జూబ్లీ హిల్స్, ఉదయం 11 గంటలకు ఖైరతాబాద్ అనంతరం నాంపల్లి ప్రాంతాల్లో తాము పర్యటించడం జరుగుతుందన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి మాట్లాడుతామన్నారు. 

యువతను ప్రోత్సాహించడానికి కిరణ్‌కు టికెట్ ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. అయితే..దేశ రాజకీయాలు ప్రభావితం చూపించాయన్నారు. పోలింగ్ తర్వాత సికింద్రాబాద్‌లో గెలుస్తామని బీజేపీ నేతలు చెప్పలేదనే విషయం గుర్తు చేసుకోవాలన్నారు తలసాని

Reasons
Talasani Sai Kiran Yadav
Losing
Secunderabad

మరిన్ని వార్తలు