
చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్, ఒప్పో సబ్ బ్రాండ్ రియల్ మి నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. స్మార్ట్ ఫోన్ ఫ్లాగ్ షిప్ కేటగిరీతో Realme X మోడల్ ను కంపెనీ చైనాలో రిలీజ్ చేసింది. ఇండియా మొబైల్ మార్కెట్ లో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ మేకర్ గా పేరొన్న రియల్ మి 15వేల లోపు స్మార్ట్ ఫోన్లను ఆఫర్ చేస్తూ వస్తోంది. ఇండియాలో ఇతర మొబైల్ మేకర్ల నుంచి పోటీ ఎక్కువగా ఉండటంతో రియల్ మి సవాల్ ఎదురైంది. షియోమీ నుంచి వచ్చిన రెడ్ మి, శాంసంగ్ నుంచి గెలాక్సీ A-సిరీస్ ఫోన్లకు భారత్ లో ఎంతో క్రేజ్ ఉంది. దీంతో ఫ్లాగ్ షిప్ కేటగిరీ ఫోన్లను రిలీజ్ చేసేందుకు కంపెనీ రెడీ అయింది.
రియల్ మి ఎక్స్ మోడల్ పేరుతో ఫ్లాగ్ షిప్ డిజైన్, స్పెషిఫికేషన్లతో తీసుకోచ్చింది. ఇప్పటివరకూ రియల్ మి నుంచి స్మార్ట్ ఫోన్లలో బడ్జెట్ ఫోన్లు కానప్పటికీ.. ఆక్టా కోర్ Snapdragon 710SoC సామర్థ్యంతో కూడిన ఫోన్లను రిలీజ్ చేసింది. రియల్ మి బ్రాండ్ నుంచి రియల్ 3 స్మార్ట్ ఫోన్ 2019 మార్చిలో భారత మార్కెట్లో రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే దూకుడుతో రియల్ మి నుంచి FlagShip Device .. Realme X కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేస్తోంది. రియల్ మి ఎక్స్ ఫీచర్లు, స్పెషిఫికేషన్లు ఎలా ఉన్నాయో ఓసారి లుక్కెద్దాం.
Realme X.. ఫోన్ లో నాచ్ లెస్ డిస్ ప్లే, ఇన్ -డిస్ ప్లే ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఉంది. వాటర్ డ్రాప్ నాచ్ లేదు. కానీ, ఇందులో 16మెగా ఫిక్సల్ పాప్ అప్ సెల్ఫీ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. 48MP ప్రైమరీ కెమెరాతో సోనీ ఐఎంఎక్స్ 586 సెన్సార్ కూడా ఉంది. నైట్ స్కేప్, క్రోమా బూస్ట్ మోడ్స్ కు సపోర్ట్ చేసేలా ఉంది. ఏఐ సీన్ డిటెక్షన్, 960ఎఫ్ పీఎస్ సూపర్ స్లో-మోరికార్డింగ్ ఉంటుంది. హెడ్ ఫోన్ జాక్ తో పాటు 3.765mAH బ్యాటరీ సామర్థ్యం ఉంది.
ఒప్పో vooc 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంది. రియల్ మి ఎక్స్ ధర విషయానికి వస్తే.. చైనాలో ప్రారంభ ధర ప్రకారం.. (4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ) ఫోన్ ధర రూ.CNY 1,199 (రూ.12వేల 300) వరకు ఉండగా, 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ ధర CNY 1,299 (రూ.13వేల 300), మూడో వేరియంట్ (6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ) ధర cny 1,499 (రూ.15వేల 400)గా ఉన్నాయి. రెండు గ్రేడియంట్ కలర్లు బ్లూ, వైట్ కలర్లలో అందుబాటులో ఉన్నాయి.
స్పెషిఫికేషన్లు, ఫీచర్లు ఇవే :
* ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 710ఎస్ఓసీ
* 48మెగా ఫిక్సల్ ప్రైమరీ కెమెరా
* 4GB ర్యామ్+ 64GB, 6GB ర్యామ్ + 64GB
* 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ
* 16MP pop up సెల్ఫీ కెమెరా
* సోనీ ఐఎంఎక్స్ 586 సెన్సార్
* నైట్ స్కేప్, క్రోమా బూస్ట్ మోడ్స్
* నాచ్ లెస్ డిస్ ప్లే, ఇన్ -డిస్ ప్లే ఫింగర్ ఫ్రింట్ సెన్సార్
* USB టైప్-సి పోర్ట్, డాల్ బై ఆటోమ్స్ సపోర్ట్
* 3.765mAH బ్యాటరీ
* ఒప్పో vooc 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్
* 4G LTE సపోర్ట్, Wi-Fi 802.11ac
* బ్లూ టూత్ 5, GPS, 161.2x76.9s9.4mm
* బరువు 191 గ్రాములు, ఏఐ సీన్ డిటెక్షన్
* 960ఎఫ్ పీఎస్ సూపర్ స్లో-మోరికార్డింగ్