RCBvsMI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై

Submitted on 15 April 2019
RCBvsMI: Mumbai WON toss elected to bowl

ఐపీఎల్ 2019లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడేందుకు ముంబై ఇండియన్స్ సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై  ఫీల్డింగ్ ఎంచుకుంది.

టోర్నీలో 31వ మ్యాచ్ ఆడుతోన్న ఇరుజట్లలో.. తొలి విజయం అనంతరం బెంగళూరు విజయాన్ని కొనసాగించాలని కోరుకుంటుంటే.. ముంబై ఇండియన్స్ గత మ్యాచ్‌లో పరాభవానికి ముగింపు పలకాలని భావిస్తోంది. 

టాస్ అనంతరం మాట్లాడిన రోహిత్.. ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలిపాడు. అల్జర్రీ గాయపడడంతో మలింగను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు.  కాగా, కోహ్లీ గత మ్యాచ్‌లో విజయం సాధించిన అదే జట్టుతో బరిలోకి దిగనున్నట్లు పేర్కొన్నాడు. 

జట్లు:
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు:
పార్థివ్ పటేల్, విరాట్ కోహ్లీ, డివిలియర్స్, మార్కస్ స్టోనిస్, మొయిన్ అలీ, అక్షదీప్ నాథ్, పవన్ నేగీ, ఉమేశ్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, నవదీప్ షైనీ, మొహమ్మద్ షమీ

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్, జాసన్ బహ్రెండార్ఫ్, లసిత్ మలింగ, జస్ప్రిత్ బుమ్రా

 


 

rcb
MI
IPL 2019
IPL
royal challengers bangalore
MUMBAI INDIANS

మరిన్ని వార్తలు