ఐపీఎల్ ఓవర్ నైట్ స్టార్ పేరు దీపిక ఘోష్

Submitted on 7 May 2019
RCB fan girl goes viral overnight

ఐపీఎల్ సాధారణ ప్లేయర్లను సైతం స్టార్ ప్లేయర్లుగా మారడానికి చక్కని వేదిక. ప్లేయర్లతో పాటు స్టేడియానికి మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానులను సైతం సెలబ్రిటీలను చేసేస్తుంది. ఈ క్రమంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మధ్య మ్యాచ్ జరిగింది. 

ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ హాట్ బ్యూటీ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. లుక్స్‌తో ఫామస్ అయిపోయిన మళయాళ నటి ప్రియా వారియర్ లాగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయి ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది. అయింది. మ్యాచ్ గెలిచిన వెంటనే బెంగళూరు అభిమాని అయిన ఈ అమ్మడి వైపు  స్క్రీన్‌లన్నీ తిరగడంతో సోషల్ మీడియాలో అంతా ఫిదా అయిపోయింది. 

ఇంటర్నెట్‌లో ఎవరీ మిస్టరీ గర్ల్.. అంటూ నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటో షేర్ చేసుకోవడంతో దీపిక ఘోష్‌గా నిర్దారణ అయింది. అంతే ఆ యువతికి అమాంతంగా ఫాలోవర్లు పెరిగిపోయారు. 

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ధేశించిన 176 పరుగుల విజయలక్ష్యాన్ని ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ సీజన్‌లో ఆర్సీబీ ఆఖరి మ్యాచ్‌ను విజయంతో ముగించింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#RCB girl forever ❤️?

A post shared by deepika (@deeghose) on

Deepika Ghose
rcb
srh
rcb fan

మరిన్ని వార్తలు