షాకిచ్చిన ఆర్బీఐ : సిటీ బ్యాంకుకు రూ.3 కోట్ల జరిమానా

Submitted on 12 January 2019
RBI slaps Rs 3 crore penalty on Citibank India

న్యూఢిల్లీ:  సిటీ బ్యాంకు ఇండియాకు ఆర్బీఐ షాక్ ఇచ్చింది. ‘ఫిట్-అండ్- ప్రాపర్ క్రైటీరియా’కు సంబంధించి సూచనలను సిటీ బ్యాంకు పాటించలేదనే కారణంతో జరిమానా విధించినట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. మార్గదర్శకాలకు అనుగుణంగా బ్యాంకు డైరెక్టర్ల నియామకం జరుగలేదని ఆర్బీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. జనవరి 4న ఆర్బీఐ సిటీ బ్యాంకుపై పెనాల్టీ వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

‘ఫిట్-అండ్- ప్రాపర్ క్రైటీరియా’ కింద సిటీ బ్యాంకుకు రూ.30 మిలియన్లు (రూ.3 కోట్లు) జరిమానా విధించింది. వినియోగదారుల లావాదేవీలతో ఈ జరిమానాకు ఎలాంటి సంబంధం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. 2013 జూలైలో కూడా ఆర్బీఐ సిటీ బ్యాంకును హెచ్చరిస్తూ యాంటీ మనీ లాండరింగ్ నిబంధనల అతిక్రమణ కింద ఓ లేఖను జారీ చేసింది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సిటీ బ్యాంకు భారత్ లో 115 ఏళ్లుగా సేవలు అందిస్తోంది.  

RBI
penalty
Citibank India
US
Citibank NA India 

మరిన్ని వార్తలు