RBI గుడ్ న్యూస్ : హోంలోన్ పై EMI ఎంత తగ్గుతుందో తెలుసుకోండి

Submitted on 7 February 2019
 RBI repo rate decreased


కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన కొన్నాళ్లకే ఆర్బీఐ కీలక సమావేశాన్ని నిర్వహించింది. గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కీలక వడ్డీ రేటు తగ్గిస్తూ శుభవార్త చెప్పింది. బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే వడ్డీ రేటు(రెపో రేటు)ను 25 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గించింది. అంటే ప్రస్తుతమున్న 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గిందన్న మాట. శక్తికాంత దాస్ నేతృత్వంలో ఏర్పాటైన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలిసి కమిటీ(ఎంపీసీ) ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. 

 

హోంలోన్ పై EMI ఎంత తగ్గుతుందో తెలుసుకుందాం :
మీరు ఇంటిపై 30 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు. 20 సంవత్సరాల గడువు. ఇప్పుడు బ్యాంక్ వడ్డీ రేటు 8.8శాతంగా ఉంది అనుకుంటే.. మీరు ప్రతి నెల 26వేల 607 రూపాయలు EMI కడుతున్నారు. 
ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ తగ్గించిన రెపోరేటు ద్వారా అదే బ్యాంక్ వడ్డీ రేటు 8.55శాతానికి తగ్గుతుంది. అంటే నెలనెలా కట్టే EMI ఇక నుంచి రూ.26వేల 129గా ఉండనుంది. దీంతో ప్రతి నెలా 477రూపాయల ఈఎంఐ తగ్గుతుంది. 
(నోట్ : కొత్త వడ్డీ రేట్లు ఫ్లోటింగ్ విధానంలో అప్పుతీసుకున్నవారికే.)

 

అటు వడ్డీ రేట్లు తగ్గించి కస్టమర్లకు లాభం చేకూరుస్తూ.. రివర్స్ రెపో రేట్ (ఆర్బీఐకి బ్యాంకులు ఇచ్చే రుణంపై వడ్డీ)ను కూడా 6 శాతానికి తగ్గించింది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్‌ను 6.5 శాతంగా ఉంచారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతంగా ఉంచే లక్ష్యంతో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మానిటరీ పాలసీ కమిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

  • వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వృద్ధి రేటు 7.4శాతంగా ఉండనున్నట్లు అంచనా.
  • జనవరి-మార్చి ద్రవ్యోల్బణం 2.4శాతంగా ఉండొచ్చని భావిస్తూ.. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకూ 3.2-3.4శాతంగా ఉండొచ్చు. 
     

 

repo rate
reverse repo rate
RBI

పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్ పై యుద్ధం చేయాలనే డిమాండ్ పై మీరేమంటారు?

Choices

మరిన్ని వార్తలు