'కనకదుర్గ' మాస్ మహారాజా కొత్త సినిమా షురూ

Submitted on 15 March 2019
Ravi Teja’s Upcoming Film With Santosh Srinivas Titled ‘Kanakadurga’

మాస్ మహారాజా రవితేజ.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా చేశాడు. ఈ సినిమా ప్లాప్ అయినప్పటికి తాజాగా మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు మైత్రి మేకర్స్ వారు. రభస డైరెక్టర్ సంతోష్ స్రీనివాస్ దర్శకత్వంలో తమిళ సినిమా తేరీ రిమేక్ గా ఈ సినిమా చేయబోతున్నారు. రవితేజతో వరుసగా రెండు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకుంది మైత్రి సంస్థ. స్క్రిప్ట్ మీద ఖర్చు, అడ్వాన్స్ లు కూడా ఇచ్చింది. ఆ కారణంగానే తమ బ్యానర్ కి ఫ్లాప్ ఇచ్చినప్పటికీ రవితేజతో మరో సినిమా చేయడానికి రిస్క్ తీసుకుంటుంది.
Read Also: ఓటర్ టీజర్: ఎలక్షన్‌ను క్యాష్ చేసుకుంటున్నారా?

ఈ కథను మొదట పవన్ కళ్యాణ్ కోసం అనుకున్నప్పటికీ ఆయన రాజకీయల్లోకి జంప్ అవ్వడంతో రవితేజతో ప్రొసీడ్ అవుతున్నారు. అయితే కొన్ని సమస్యలు రావడంతో సినిమాకి గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమా పనులు మొదలుపెట్టారు. ఈ సినిమాకి 'కనకదుర్గ' టైటిల్ ను ఫైనల్ చేయాలని చూస్తున్నారు.

గతంలో కృష్ణ అనే మాస్ సినిమా చేశాడు ఇప్పుడు కనకదుర్గ మంచి టైటిల్ అనే అనుకోవాలి. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ రవితేజతో జోడి కట్టనుంది. మరి ఈ ఇద్దరు కాంబినేషన్ లో అయినా మైత్రి మూవీ మేకర్స్ కి కాసుల వర్షం కురిపిస్తుందో లేదో చూడాలి. ఎక్కువ ఆలస్యం చేయకుండా విలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసుకుని దసరా లోపు తెరపైకి రావలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు.  
Read Also: మ‌జిలి మూడో సాంగ్ ‘నా గుండెల్లో’ విడుదల

Ravi Teja’s Upcoming Film
Santosh Srinivas
‘Kanakadurga’

మరిన్ని వార్తలు